Union Budget 2021: స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గనున్నాయా...లేదా

Union Budget 2021: కేంద్ర ఆర్దిక మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అందరి ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. జీఎస్టీ తగ్గుతుందని ఆశిస్తున్నారు. 

Last Updated : Jan 31, 2021, 06:08 PM IST
Union Budget 2021: స్మార్ట్‌ఫోన్ ధరలు తగ్గనున్నాయా...లేదా

Union Budget 2021: కేంద్ర ఆర్దిక మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై అందరి ఆశలు నెలకొన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు. జీఎస్టీ తగ్గుతుందని ఆశిస్తున్నారు. 

ఫిబ్రవరి 1న అంటే రేపు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Union Finance minister Nirmala Sitharaman ) బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోవిడ్ 19 మహమ్మారి నేపధ్యంలో మందగించిన ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పలు ఉత్పత్తుల తయారీ రంగాలు ఈ బడ్జెట్‌పై చాలా ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ రంగం ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ రంగం కోసం బడ్జెట్ ( Union Budget ) ‌లో కేటాయింపులు పెరుగుతాయని స్మార్ట్‌ఫోన్ ( Smartphone ) తయారీదారులు ఆశిస్తున్నారు. 

మేకిన్ ఇండియా  ( Make in India ) ఉత్పత్తుల్ని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో సెల్యులార్ హ్యాండ్‌సెట్‌లపై కస్టమ్స్ సుంకాన్ని గతంలో 20 శాతం పెంచారు. అయితే జీఎస్టీ ( GST ) ను తగ్గించాలనే డిమాండ్ వస్తోంది. 2019 మార్చ్‌లో మొబైల్ పరిశ్రమపై 50 శాతం పన్ను అధికంగా విధించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు మొబైల్ పరిశ్రమ తెలిపింది. మొబైల్ ఫోన్‌లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. మరోవైపు ఎలక్ట్రానిక్స్ అభివృద్ధికి సంబంధించిన సెంటర్స్ ఆఫ్ ఎక్సెలెన్స్ కోసం 5 వందల కోట్లు, మొబైల్ డిజైన్ సెంటర్ కోసం 2 వందల కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని ఐసీఇఏ కేంద్రానికి సిఫారసు చేసింది. జీఎస్టీని తగ్గిస్తే..కచ్చితంగా రేపటి బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ ధరలు ( Smartphone prices ) తగ్గే అవకాశాలున్నాయి.

Also read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధరలు, రికార్డు స్థాయికి చేరిన Silver Price

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News