RBI: సంచలనం.. ఆర్బీఐకి రావాల్సిన రూ. 88 వేల కోట్లు మిస్సింగ్.. వెలుగులోకి తెచ్చిన ఆర్టీఐ ప్రశ్న

Reserve Bank of India: భారత కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ల ద్వారా ఆర్బీఐకి రావాల్సిన రూ. 88 వేల కోట్లు మిస్సింగ్ అయినట్లు ఓ రిపోర్టు బయటపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2023, 02:33 PM IST
RBI: సంచలనం.. ఆర్బీఐకి రావాల్సిన రూ. 88 వేల కోట్లు మిస్సింగ్.. వెలుగులోకి తెచ్చిన ఆర్టీఐ ప్రశ్న

Reserve Bank of India: భారతీయ మింట్‌లలో ముద్రించిన దాదాపు రూ.88,032.5 కోట్ల విలువైన రూ.500 నోట్లకు సంబంధించిన సమాచారం ఆర్‌బీఐ వద్ద లేదని తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం.. లెక్కల్లో లేని నోట్ల విలువ రూ. 88,032.5 కోట్లుగా తేలింది. పాతనోట్లను రద్దు చేసి, కొత్త రూ.500 నోట్లను తీసుకొచ్చిన సమయంలో దేశంలోని మూడు ముద్రణ సంస్థలు 8,810.65 మిలియన్ల రూ. 500 నోట్లను ముద్రించాయి. అయితే ఇందులో 7,260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్బీఐ వద్దకు చేరినట్లు ఆర్టీఐ నివేదిక పేర్కొంది. మిగతా 1,760.65 మిలియన్ల నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఆర్‌బీఐ దగ్గర లేదని రిపోర్టు వెల్లడించింది. సమాచార హక్కు చట్టం ప్రకారం మనోరంజన్‌రాయ్‌ అనే సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

భారతీయ కరెన్సీ నోట్లు మూడు ప్రభుత్వ మింట్‌లలో ముద్రించబడతాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్- బెంగళూరు, కరెన్సీ నోట్ ప్రెస్- నాసిక్ మరియు దేవాస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్. ఈ మూడు మింట్‌లు ముద్రించిన నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పంపుతాయి.

నాసిక్ మింట్ రూ.500 నోట్లకు సంబంధించి కొత్తగా 375.450 మిలియన్ నోట్లను ముద్రించిందని రిపోర్టు పేర్కొంది. అయితే ఆర్‌బిఐ రికార్డులు, ఏప్రిల్ 2015 మరియు డిసెంబర్ 2016 మధ్య 345 మిలియన్ల నోట్లను మాత్రమే పొందినట్లు తెలిపాయి. ఆర్థిక సంవత్సరం 2015-2016 (ఏప్రిల్ 2015-మార్చి 2016) రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంకుకి 210.000 మిలియన్ నోట్లు సరఫరా చేయబడ్డాయని నివేదిక వెల్లడించింది. 

Also Read: Umang App: ఇక ఇంట్లోంచే పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు

రూ. 500 నోట్లకు సంబంధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ (పి) లిమిటెడ్- బెంగళూరు, ఆర్‌బిఐకి 5,195.65 మిలియన్ నోట్లను సరఫరా చేసింది. మరోవైపు బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్, 2016-2017లో ఆర్‌బిఐకి 1,953.000 మిలియన్ నోట్లను ఇచ్చింది. మూడు ప్రింటింగ్ ప్రెస్ లు 8810.65 మిలియన్ నోట్లను ముద్రించగా.. ఆర్బీఐకి కేవలం 7260 మిలియన్ నోట్ల మాత్రమే అందాయి. ఇంత భారీ సంఖ్యలో కరెన్సీ మిస్సవడం దేశభద్రతకే పెను ముప్పు అని రాయ్ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరపాలని కోరుతూ సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈడీకి లేఖ రాశారు.

Also Read: ITR Filing 2023: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా..? ఈ విషయాలు అస్సలు మర్చిపోకండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News