Sim Recharge Without Platform Fees In India: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు మొబైల్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోంది. ప్రతి విషయాన్ని స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకుంటున్నారు. అయితే ఇంటర్నేట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ వినియోగం మరింత రెట్టింపు అయ్యింది. ఇప్పుడు మొబైల్ మొత్తం ఇంటర్నేట్ మీదే రన్ అవుతుంది. యాప్స్ నుంచి మొదలుకొని బ్రౌజింగ్ వరకు ప్రతి ఒక్కటి ఇంటర్నేట్ సపోర్ట్‌ను కలిగి ఉంటాయి. అయితే స్మార్ట్ ఫోన్‌లో ఇంటర్నేట్ రన్ అవ్వడానికి ప్రతి నెలా మొబైల్ రీఛార్జ్ PhonePe లేదా Paytm ద్వారా చేస్తూ ఉంటారు. ఇలా రిచార్జ్ చేసే క్రమంలో ఎంతో కొంత ప్లాట్‌ఫారమ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
కొన్ని సార్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా రిచార్జ్ చేయడం వల్ల ప్రతి రీఛార్జ్‌కి రూ.1 నుంచి రూ.2 వరకు ప్లాట్‌ఫారమ్ ఫీజు పడుతుంది. ఇక నుంచి ఎలాంటి ఫీజు లేకుండా జీరో ప్లాట్‌ఫారమ్ ఫీజ్‌తో రిచార్జ్ చేసుకునే టిప్‌ను అందించబోతున్నాం. ప్రస్తుతం చాలా మంది PhonePe లేదా Paytm నుంచి రిచార్జ్ చేసుకుంటారు. ఇక నుంచి ఇలా చేయడం మానుకోవాల్సి ఉంటుంది. సిమ్ కంపెనీకి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ నుంచి రీఛార్జ్ చేయడం వల్ల జీరో ప్లాట్‌ఫారమ్ ఫీజ్‌తో పొందవచ్చు.
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
అమెజాన్ పే(Amazon Pay):
జీరో ప్లాట్‌ఫారమ్ ఫీజుతో సిమ్ రీఛార్జ్ చేసుకోవాలనుకునేవారు Amazon Payని కూడా వినియోగించవచ్చు. ఇందులో ఎలాంటి రిచార్జ్‌లు చేసినా ప్లాట్‌ఫారమ్ ఫీజ్ లేకుండా పొందవచ్చు. దీంతో పాటు మీరు అమెజాన్ పోస్ట్‌పేయిడ్ పే వినియోగించి కూడా ఫ్రీ రీఛార్జ్ పొందవచ్చు.
క్రెడ్(Cred):
క్రెడ్(Cred) యాప్‌ను వినియోగించి కూడా ఎలాంటి ప్లాట్‌ఫారమ్ ఫీజు చెల్లించకుండా మొబైల్‌కి రీఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా నేరుగా క్రెడిట్ కార్డ్‌తో రిచార్జ్ చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. రిచార్జ్ చేయడం వల్ల రివార్డ్ పాయింట్లతో పాటు క్యాష్‌బ్యాక్ పొందే ఛాన్స్‌ను కూడా అందిస్తోంది.
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి