Paytm: పేటీఎం పలు కీలక నిర్ణయాలు..సీఈవోగా మళ్లీ ఆయనకే అవకాశం..!

Paytm: ప్రముఖ డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా మళ్లీ విజయ్ శేఖర్‌ శర్మను కొనసాగించాలని నిర్ణయించారు. ఈమేరకు కంపెనీ బోర్డులో తీర్మానం చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 07:27 PM IST
  • పేటీఎం కీలక నిర్ణయం
  • ప్రస్తుత సీఈవోనే ఐదేళ్లపాటు పొడిగింపు
  • సంయూక్త బీమా కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనకు ఓకే
Paytm: పేటీఎం పలు కీలక నిర్ణయాలు..సీఈవోగా మళ్లీ ఆయనకే అవకాశం..!

Paytm: ప్రముఖ డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ పేటీఎం కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా మళ్లీ విజయ్ శేఖర్‌ శర్మను కొనసాగించాలని నిర్ణయించారు. ఈమేరకు కంపెనీ బోర్డులో తీర్మానం చేశారు. విజయ్ శేఖర్‌ శర్మ పదవికాలాన్ని మరో ఐదేళ్లకు పొడిగించారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్ఛెంజీ ఫైలింగ్ సందర్భంగా పేటీఎం తెలిపింది.  2027 చివరి వరకు ఆయన పదవిలో ఉండనున్నారు. 

పేటీఎం చీఫ్‌ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అయిన మధుర్ దేవరాను పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమించారు. ఈమేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. దీనితోపాటు పలు కీలక నిర్ణయాలను పీటీఎం తీసుకుంది. పేటీఎం జనరల్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్‌ పేరుతో సంయుక్త బీమా కంపెనీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. కంపెనీలో పేటీఎం మాతృక సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు 49 శాతం వాటా, విజయ్ శేఖర్‌ వర్మ కంపెనీ అయిన వీఎస్‌ఎస్ హోల్డింగ్‌ ప్రైవేట్ లిమిటెడ్‌కు 51 శాతం వాటా ఉండనుంది. ఈమేరకు పేటీఎం కంపెనీ ప్రకటనలో తెలిపింది.

బీమా కంపెనీలో రాబోయే 10 ఏళ్లలో రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. పెట్టుబడులతో బీమా కంపెనీలో పేటీఎం వాటా పెరగనుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీటితోపాటు పేటీఎం త్రైమాసిక ఫలితాలను సైతం వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం చివరిలో వన్ 97 కమ్యూనికేషన్స్  నష్టాలు మరింత పెరిగాయి. ఈ నష్టాలు రూ.761.4 కోట్లకు చేరినట్లు సదురు సంస్థ వెల్లడించింది. 2020-21 మొదట్లో రూ.441.8 కోట్ల నష్టాలను సంస్థ చవిచూసింది. 2020-21లో నష్టాలతో పోలిస్తే భారీలు అధికంగా వచ్చినట్లు తెలుస్తోంది.

Also read:KTR Tour In London: తెలంగాణ తల్లి రుణం తీర్చుకోండి, ఎన్నారైలకు కేటీఆర్ పిలుపు

Also read:CM Kcr Tour: త్వరలో కీలక పరిణామం..ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్య..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

 

Trending News