ZEEL-SONY Merger: దేశంలోని రెండు అతిపెద్ద మీడియా ఎంటర్టైన్మెంట్ గ్రూపులు జీల్, సోనీల విలీన వార్త ఇది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విలీనానికి ఆటంకం తొలగింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఈ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీల్‌కు సంబంధించిన అభ్యంతరాలను కొట్టివేసింది ఎన్సీఎల్టీ.
జీ ఎంటర్టైన్మెంట్ , సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీన ప్రతిపాదనకు నేషనల్ కంపెనీ ల్యా ట్రిబ్యునల్ ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించి ఎదురైన అన్ని ఇబ్బందుల్ని తొలగించింది. ఎన్‌సిఎల్‌టి ఆదేశాల పూర్తి వివరాలు రేపు అంటే శుక్రవారం నాటికి అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైతే ఎన్సిఎల్టీ ఆమోద ముద్ర వేసిందనే వార్త వెలువడగానే జీ షేర్లలో పెరుగుదల కన్పించింది. దాదాపు 16 శాతం పెరిగినట్టు అంచనా.
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్సర్చ్ నెట్వర్క్స్ ఇండియా విలీన ప్రక్రియకు ఆమోదం లభించింది. ఈ విలీనం తరువాత సోనీ కంపెనీది అతి పెద్ద వాటా అవుతుంది. విలీనం తరువాత కొత్త కంపెనీగా భారతీయ షేర్ మార్కెట్లో లిస్ట్ కానుంది. ఈ రెండు కంపెనీల విలీనంతో షేర్ హోల్డర్లకు భారీ లాభాలు కలిగే అవకాశముంది.
జీ విలీనం విషయంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవల్సి వచ్చిందని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ సోనమ్ చంద్వానీ తెలిపారు. ఇప్పుడు డీల్ ముందుకు వెళ్తుందనే నమ్మకం కలుగుతోంది. సోనీతో జీ విలీనం నేపధ్యంలో దాదాపు అందరు వాటాదారులకు ప్రయోజనం కలగనుంది. విలీన ప్రక్రియతో కంపెనీ విలువ పెరగనుంది. ఫలితంగా షేర్ హోల్డర్లకు లాభం చేకూరనుందని సోనమ్ చంద్వానీ చెప్పారు. ఇక కంటెంట్ పరిధి పెరగడం వల్ల ప్రేక్షకులకు మరింత లాభం కలగనుంది. ప్రస్తుతం జీల్ షేర్ హోల్డర్ల వాటా 61.25 శాతం ఉంది. 157.51 కోట్ల డాలర్ల పెట్టుబడితో భాగస్వామ్యంలో మార్పు వస్తుంది. ఆ తరువాత జీల్ పెట్టుబడిదారుల వాటా 47.07 శాతం ఉండవచ్చు. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ షేర్ హోల్డర్ల వాటా 52.93 శాతం ఉంటుందని అంచనా.
జీల్, సోనీ విలీనం అనంతరం మీడియా ఎంటర్టైన్మెంట్ పరిశ్రమకు భారీ ప్రయోజనం చేకూరనుంది. జీ , సోనీ విలీనంతో దేశంలోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఆవిర్భవించనుంది. ఈ కంపెనీ రెవిన్యూ విలువ 2 బిలియన్ డాలర్లు ఉండవచ్చు. విలీనం తరువాత ఏర్పడే కంపెనీలో సోనీ పెట్టే పెట్టుబడితో స్పోర్ట్స్ సహా ఇతర ప్రీమియం కంటెంట్‌లో ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం కలగవచ్చు. సమీప భవిష్యత్తులో ఇండియా టీవీ, డిజిటల్ రంగంలో అతిపెద్ద మార్కెట్‌గా ఎదగనుంది. జీ తన డిజిటల్ ఉనికిని పెంచడంతో పాటు లీనియర్ టీవీలో పెట్టుబడుల్ని కొనసాగించనుంది.
వాస్తవానికి జీ ఎంటర్టైన్మెంట్ -సోనీ పిక్సర్స్ నెట్వర్క్స్ ఇండియా విలీన ప్రకటన తొలిసారిగా 2021 సెప్టెంబర్ 22న వెలువడింది. జీల్-సోనీ విలీనం అనంతరం ఏర్పడే కంపెనీలో 11,605.94 కోట్ల పెట్టుబడి ఉండవచ్చు. విలీనం తరువాత జీ ఎంటర్టైన్మెంట్కు 47.07 శాతం వాటానే మిగులుతుంది. సోనీ పిక్చర్స్‌కు 52.93 శాతం వాటా లభిస్తుంది. విలీన కంపెనీను కొత్త కంపెనీగా షేర్ మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు.
రెండు కంపెనీల టీవీ వ్యాపారం, డిజిటల్ అసెట్స్, ప్రొడక్షన్ ఆపరేషన్, ప్రోగ్రామ్ లైబ్రరీని కూడా విలీనం చేయనున్నారు. జీల్, ఎస్పీఎన్ఐ మధ్య ప్రత్యేకమైన నాన్ బైండింగ్ టర్మ్ షీట్ ఖాయమైంది. ప్రస్తుత ప్రమోటర్ ప్యామిలీ జీకు తన షేర్ హోల్డింగ్‌ను 4 నుంచి 20 శాతం పెంచుకునే అవకాశం లభిస్తుంది. అదే సమయంలో బోర్డులో మెజార్టీ సభ్యుల్ని నియమించే అధికారం సోనీ గ్రూప్‌కు ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook