ZEEL-SONY Merger: దేశంలోని రెండు అతి పెద్ద మీడియా ఎంటర్టైన్మెంట్ గ్రూపులకు సంబంధించిన వార్త ఇది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న ఆ రెండు గ్రూపుల విలీనానికి ఆమోదం లభించేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ZEEL MD & CEO Punit Goenka: దేశంలోనే మొట్టమొదటిసారిగా శాటిలైట్ టీవీ ఛానెల్ స్థాపించి ప్రైవేటు టీవీ ఛానెల్స్ పరిశ్రమకు బాటలు వేసిన సంస్థ జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) అని అన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పునిత్ గోయెంక.
ప్రముఖ భారతీయ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పవర్‌హౌస్ 'జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజైస్ లిమిటెడ్ (ZEEL)' నేడు 'జీ బ్రాండ్ వర్క్స్'ను లాంచ్ చేసింది. అన్ని రంగాలు, విభాగాల్లోని తమ క్లయింట్స్‌కి అందించే సృజనాత్మకతను మరింత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా 'జీ బ్రాండ్ వర్క్స్'ను ప్రవేశపెట్టింది.
IAA Leadership Awards: జీ ఎండి మరియు సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకాకు అరుదైన గుర్తింపు లభించింది. ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ లీడర్షిప్ అవార్డ్స్‌లో గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఆ వివరాలు మీ కోసం..
IPL Media Rights Tender e-auction: ఐపిఎల్ మీడియా రైట్స్ టెండర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేయడంతో పాటు టెండర్ల ఇ-వేలం ఎంపిక ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన బిసిసిఐని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అభినందించింది.
Essel Group Chairman Dr Subhash Chandra's Exclusive Interview: జీ బిజినెస్ మేనేజింగ్ ఎడిటర్ అనిల్ సింగ్వి చేసిన ఈ స్పెషల్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూలో ఎస్సెల్ గ్రూప్ సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యులు డా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. జీ గ్రూప్ విజన్ ఏంటి ? జీ మీడియా భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, జీల్-సోని విలీనం, తదితర అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఇక్కడ మీ కోసం...
ZEEL-SPNE Signs: ప్రతిష్ఠాత్మక జీల్, సోనీ నెట్వర్క్స్ విలీన ప్రక్రియ ముగిసింది. కీలకమైన ఒప్పందంపై రెండు సంస్థల సంతకాల ప్రక్రియ పూర్తయింది. రెండు సంస్థ విలీనంతో కొత్తగా ఏర్పడిన ఉమ్మడి సంస్థ త్వరలో పబ్లిక్ లిస్టింగ్ కానుంది.
Bombay High Court bars Invesco from calling EGM: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌లో మేజర్ షేర్‌హోల్డర్ అయిన ఇన్వెస్కో (Invesco) సంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి వీలు లేకుండా తాత్కాలికంగా బాంబే హై కోర్టు జీల్ సంస్థకు అనుకూలంగా ఇంజక్షన్ ఆర్డర్స్ జారీచేసింది. బాంబే హై కోర్టు మంగళవారం తీసుకున్న ఈ నిర్ణయం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కి (ZEEL) భారీ ఊరటనిచ్చింది.
Reliance statement about ZEEL-Invesco case: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థకు పునీత్ గోయెంకాను ఎండీ, సీఈఓగా (ZEEL MD & CEO Mr. Punit Goenka) కొనసాగుతారని జీల్ చెప్పిన విషయాన్నే రిలయన్స్ ఇండస్ట్రీస్ చేసిన ప్రకటనలోనూ ప్రస్తావించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
ZEEL-Invesco Case: ZEEL బోర్డ్ విడుదల చేసిన ఓ లేఖ ప్రకారం, ఇన్వెస్కో చేసిన ప్రతిపాదన, ఒప్పందంలో ఎదురయ్యే కొన్ని పాలనాపరమైన సమస్యలను పునీత్ గోయెంకా ప్రస్తావించారు. ముఖ్యంగా ఇన్వెస్కో తీసుకొస్తున్న స్ట్రాటెజిక్ గ్రూప్ వ్యాల్యుయేషన్ గురించి పునీత్ గోయెంకా పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో తన అసలు రంగు బయటపెట్టిన ఇన్వెస్కో.. పునీత్ గోయెంకా లేకుండా కూడా ఈ డీల్‌ని పూర్తి చేయవచ్చని చెప్పి తన మోసపూరిత వైఖరిని బయటపెట్టుకుంది.
ZEEL, Sony merger deal intersting points to know: జీ ఎంటర్టైన్మెంట్, సోని పిక్చర్స్ విలీనంతో రెండు కంపెనీలకు చెందిన కంటెంట్‌ని షేర్ చేసుకునే సౌలభ్యం ఏర్పడటంతోపాటు ఇరు పార్టీలకు చెందిన డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది. అలాగే భారత్‌లో సోనీ తన ఉనికిని మరింత పెంచుకునే అవకాశం కూడా కలగనుంది.
ఫిబ్రవరి 14, 2018 నుండి జీ 5 సేవలు ప్రారంభమవనున్నాయి. జీ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఒకే డిజిటల్ వ్యవస్థపైకి పైకి తీసుకువచ్చేందుకు ఈ సరికొత్త వేదిక ప్రారంభమైంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.