SIP: తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగుల కోసం తాపత్రయపడటం అనేది సహజం. వారి భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఉన్నత చదువులు వివాహం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో భారీ మొత్తంలో అప్పులు సైతం చేస్తూ ఉంటారు. పిల్లలకు మెడిసిన్ సీటు ఇంజనీరింగ్ సీటు ఇలాంటివి వచ్చినప్పుడు ఫీజు కట్టేందుకు తమ ఆస్తులను సైతం తనకా పెడుతూ ఉంటారు.
అయితే మీ పిల్లల బాగోగుల కోసం వారు ఉన్నత విద్య కోసం పిల్లలు పుట్టినప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే పెద్ద మొత్తంలో మీరు వారి పేరిట డబ్బులు పొదుపు చేయవచ్చు. మీ పిల్లవాడు ఇంటర్మీడియట్ పూర్తయ్యలోగా 25 లక్షల రూపాయలు పొదుపు చేయాలి అనుకుంటున్నారా… అయితే ఇక్కడ కొన్ని ఒక టెక్నిక్ ద్వారా మీరు పిల్లవాడు ఇంటర్మీడియట్ పూర్తయ్యేలోగా 25 లక్షల రూపాయలు ఎలా పొదుపు చేయాలో తెలుసుకుందాం..
మ్యూచువల్ ఫండ్స్ గురించి ప్రతి ఒక్కరు వినే ఉంటారు. ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సిప్ పద్ధతి, ఇందులో ప్రతినెల ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెడుతూ కొన్ని సంవత్సరాల పాటు మదుపు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే మీకు నిర్ణీత కాలవ్యవధిలో పెద్ద మొత్తంలో డబ్బులు లభించే అవకాశం ఉంటుంది. ఇక రెండో పద్ధతిలో లంప్సం మొత్తంలో ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇలా చేసినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడి పై కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది.
ఇప్పుడు మీ పిల్లల పేరిట డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. సిస్టమాటికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సిప్ పద్ధతిలో పిల్లల పేరిట ప్రతినెల కనీసం 3000 రూపాయలు 18 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే వారు ఉన్నత విద్యాభ్యాసానికి చేరుకునే నాటికి కనీసం 25 లక్షల నుంచి 30 లక్షల వరకు డబ్బులు లభించే అవకాశం ఉంటుంది
దీనికి సంబంధించిన లెక్క ఒకటి చూద్దాం.. ఉదాహరణకు మీ పిల్లవాడు పుట్టినప్పటినుంచి ప్రతి నెల 3000 చొప్పున 18 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసినట్లయితే, మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టిన మొత్తం 6,48,000 రూపాయలుగా ఉంటుంది. కానీ ఈ పెట్టుబడి పై కనీసం సంవత్సరానికి 12 నుంచి 15 శాతం రాబడి అందించినట్లయితే, 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ మీకు లభించే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మీకు లభించిన వడ్డీపై వడ్డీ లభిస్తుంది తద్వారా మీరు పెట్టిన పెట్టుబడిపై చాలా రెట్లు లాభం పొందవచ్చు.
Also Read : Maruti Alto K10: గోరంత బడ్జెట్ కారు.. 50 లక్షల మంది కొనేశారు..33 కి.మీ మైలేజ్.. ధర 4లక్షల లోపే
గమనిక : మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులకు అనుసంధానం అయి ఉంటాయి. అంతేకాదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్కుకు లోబడి ఉంటాయ. పైన పేర్కొన్న సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్థిక సలహాగా భావించకూడదు. జీ తెలుగు వార్తల వెబ్ పోర్టల్ ఎలాంటి పెట్టుబడి సలహాలు ఇవ్వదు. సంబంధిత రంగంలో నిపుణుల వద్ద సలహాలు పొందండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.