Best Mutual Funds 2023: ప్రస్తుతం ఎంత సంపాదించమన్నది కాదు.. ఎంత పొదుపు చేశామన్నదే ప్రధానంగా మారింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు సంపాదించిన ప్రతి రూపాయిలో ఎంతో కొంత భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. చాలా మంది షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేందుకు యోచిస్తున్నారు. ఇక్కడ తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. అయితే రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. తలకిందులైతే మనం పెట్టిన డబ్బు మొత్తం కూడా పోయే ప్రమాదం ఉంటుంది. ఆదాయం కాస్త తక్కువ అయినా పర్లేదు.. రిస్క్ లేకుండా ఉండాలనుకునే వారు మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి కూడా మంచి రాబడిని పొందవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. చిన్న మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించుకోవచ్చు. మీరు రూ.500తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఆ ఫండ్స్‌పై ఓ లుక్కేయండి..
యాక్సిస్ బ్లూచిప్ ఫండ్
యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ ఇది పెట్టుబడి ప్రపంచంలో చాలా పెద్ద ఫండ్. ఇందులో డబ్బు పెట్టుబడి పెడితే.. రిస్క్ తక్కువగా ఉంటుంది. యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ అనేది ఒక రకమైన మ్యూచువల్ ఫండ్‌లాంటిదే.
యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్
ఇది ఎల్లప్పుడూ మనకు ఆదాయన్ని ఇచ్చే ఫండ్. ఇది పెట్టుబడిదారులకు చాలా ఉపయోకరంగా ఉంటుంది. యాక్సిస్ మిడ్‌క్యాప్ ఫండ్‌లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయడం వల్ల అధిక మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అదే విధంగా మనం పెట్టిన పెట్టుబడికి రిస్క్ కూడా తక్కువే ఉంటుంది.
ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్
ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది చిన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టేది. మీ వ్యాపారంలో లాభానష్టాలు ఉంటే.. మీరు ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్‌తో పరిష్కరించుకోవచ్చు. ఈ ఫండ్స్ లాభాన్ని తీసుకుంటాయని.. అలాగే రిస్క్ ఇస్తాయి.
(గమనిక: వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన గురించి సమాచారం మాత్రమే ఇది. మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు.. లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టేముందు మీరు సంబంధిత రంగంలోని నిపుణుల నుంచి తప్పనిసరిగా సలహా తీసుకోవాలి. దీంతో పాటు లాభాల గణాంకాలు మీ వ్యాపారం విక్రయంపై ఆధారపడి ఉంటాయి)
Also Read: Cheteshwar Pujara: పుజారా కోసం రోహిత్ శర్మ వికెట్ త్యాగం.. వందో టెస్టులో ప్రత్యేకం
Also Read: IND Vs AUS: ఆసీస్‌కు చుక్కలు చూపించిన జడేజా.. టీమిండియా సూపర్ విక్టరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి