Hyundai Venue 2023: మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ నచ్చకపోతే.. ఈ చౌకన ఎస్‌యూవీని కోనేయండి! సూపర్ మైలేజ్

Hyundai Venue 2023 Price and Mileage: కొన్ని కారణాల వల్ల టాటా నెక్సాన్ లేదా మారుతి బ్రెజాను ఇష్టపడని వారికి హ్యుందాయ్ వెన్యూ ఒక ఉత్తమ ఎంపికగా ఉంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Mar 17, 2023, 12:15 PM IST
  • మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ నచ్చకపోతే
  • ఈ చౌకన ఎస్‌యూవీని కోనేయండి
  • సూపర్ మైలేజ్
Hyundai Venue 2023: మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ నచ్చకపోతే.. ఈ చౌకన ఎస్‌యూవీని కోనేయండి! సూపర్ మైలేజ్

Hyundai Venue 2023 Price and Mileage: భారత మార్కెట్లో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి బ్రెజ్జా మరియు టాటా నెక్సాన్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 ఎస్‌యూవీ జాబితాలో 'హ్యుందాయ్ వెన్యూ' పేరు కూడా ఉంది. కొన్ని కారణాల వల్ల టాటా నెక్సాన్ లేదా మారుతి బ్రెజాను ఇష్టపడని వారికి హ్యుందాయ్ వెన్యూ ఒక ఉత్తమ ఎంపికగా ఉంది. సూపర్ లుకింగ్, మంచి మైలేజ్ కారణంగా నెక్సాన్, బ్రెజాలతో వెన్యూ పోటీపడుతోంది. 

హ్యుందాయ్ వెన్యూ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హ్యుందాయ్ వెన్యూలో మూడు ఇంజన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 83PS/114Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ MT గేర్‌ బాక్స్‌తో వస్తుంది. 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ IMT మరియు 7-స్పీడ్ DCT ఎంపికతో 120PS/172Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీలో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను కూడా ఉంటుంది. ఇది 100PS/240Nm శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ MT గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. హ్యుందాయ్ వెన్యూ ధర రూ. 7.68 లక్షల నుంచి మొదలై రూ. 13.11 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. కార్ టెక్నాలజీ, అలెక్సా మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీలో మంచి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో ఆటో AC, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, 4-వే పవర్డ్ డ్రైవర్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 4 ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, TPMS, హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్ నచ్చకపోతే.. హ్యుందాయ్ వెన్యూ మంచి ఎంపిక. 

Also Read: Eggs For Weight Loss: ఉడికించిన ఎగ్స్ తినడం ఇష్టం లేదా.. గుడ్లతో ఈ రెసిపీని ప్రయత్నించండి! రోజుల్లో బరువు తగ్గుతారు

Also Read: Honda Shine 100 CC: హోండా సరికొత్త బైక్.. ధర 65 వేలు మాత్రమే! సూపర్ లుకింగ్, బెస్ట్ మైలేజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News