Hyundai Creta 2023: కేవలం 2 లక్షలకే హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!

Hyundai Creta 2023 Down payment and EMI Calculator. భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను 'హ్యుందాయ్ క్రెటా' శాసిస్తుంది. 12 లక్షల హ్యుందాయ్ క్రెటాను కేవలం 2 లక్షలకే ఇంటికి తీసుకెళ్లండి.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 23, 2023, 01:22 PM IST
  • కేవలం 2 లక్షలకే హ్యుందాయ్ క్రెటా
  • పూర్తి వివరాలు ఇవే
  • ఎస్‌యూవీ సెగ్మెంట్‌ విభాగానికి రాజు
Hyundai Creta 2023: కేవలం 2 లక్షలకే హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!

Get Hyundai Creta 2023 Just Rs 2 lakhs on Down Payment: భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను 'హ్యుందాయ్ క్రెటా' శాసిస్తుంది. ఎస్‌యూవీ సెగ్మెంట్‌ విభాగానికి రాజు అని కూడా చెప్పొచ్చు. క్రెటా మొత్తం 25 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 10.84 లక్షల నుంచి రూ. 19.13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది డీజిల్ మరియు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. రెండు ఇంజన్‌లతో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు ఉన్నాయి. 

Hyundai Creta Price:
హ్యుందాయ్ క్రెటా పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ యొక్క E మరియు EX వేరియంట్‌ల గురించి ఇప్పుడు చూద్దాం. మీరు ఈ రెండు వేరియంట్‌లను కేవలం 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్ చేస్తే చాలు.. ఈ కారు మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఈ హ్యుందాయ్ క్రెటా కార్లకు ఎంత లోన్ తీసుకోవాలి మరియు దాని ఈఎంఐ ఎంత ఉంటుందనే వివరాలు ఓసారి తెలుసుకుందాం.

Hyundai Creta E Manual Petrol: 
హ్యుందాయ్ క్రెటా - ఇ (1.5-లీటర్ పెట్రోల్ 6-స్పీడ్-మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) యొక్క బేస్ వేరియంట్ ధర రూ. 10.84 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 12.57 లక్షలు (ఢిల్లీలో) ఉంటుంది. మీరు రూ. 2 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించి.. మిగిలిన మొత్తాన్ని (రూ. 10.57 లక్షలు) ఫైనాన్స్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు 9 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు రుణం తీసుకుంటే.. ప్రతి నెలా మీ ఈఎంఐ సుమారు రూ. 21,942 అవుతుంది. మొత్తం రుణంపై దాదాపు రూ. 2.59 లక్షల వడ్డీని మీరు చెల్లించాల్సి ఉంటుంది. 

Hyundai Creta  EX Manual Petrol: 
హ్యుందాయ్ క్రెటా ఇక్స్ (మాన్యువల్, పెట్రోల్) బేస్ వేరియంట్ ధర రూ. 11.78 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీని ఆన్-రోడ్ ధర దాదాపు రూ. 13.64 లక్షలు (ఢిల్లీలో) ఉంటుంది. మీరు ఈ కారు కోసం రూ. 2 లక్షలు డౌన్‌పేమెంట్ చేసి.. మిగిలిన మొత్తాన్ని (రూ. 11.64 లక్షలు) ఫైనాన్స్ చేయాలి. 9 శాతం వడ్డీ రేటుతో 5 సంవత్సరాలు తీసుకుంటే.. దాదాపు రూ. 24,163 ఈఎంఐ ఉంటుంది. రుణంపై మొత్తం రూ. 2.85 లక్షల వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: King Cobra Girl Viral Video: బొరియలో ఐదు కింగ్ కోబ్రాలు.. ఒట్టిచేతులతో ఈజీగా పట్టేసిన అక్కాచెల్లెళ్లు! షాకింగ్ వీడియో

Also Read: Man Kiss King Cobra Video: ఇదేం ఫాంటసీరా బాబు.. లవర్ కి పెట్టినట్టు కింగ్ కోబ్రాకి ముద్దు పెట్టేసాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News