Creta vs Elevate: హ్యుండయ్ క్రెటాకు పోటీగా హోండా ఎలివేట్, ఏ ఇంజన్ శక్తివంతమైందో తెలుసా

Creta vs Elevate: దేశంలోని కార్ మార్కెట్‌లో ఎన్నో కంపెనీలు, మరెన్నో రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. గత కొద్దికాలంగా మిడ్‌సైజ్ ఎస్‌యూవీ క్రేజ్ పెరుగుతోంది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో ఏ కంపెనీ అత్యుత్తమం అనేది పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 7, 2023, 02:27 PM IST
Creta vs Elevate: హ్యుండయ్ క్రెటాకు పోటీగా హోండా ఎలివేట్, ఏ ఇంజన్ శక్తివంతమైందో తెలుసా

Creta vs Elevate: దేశంలో హ్యాచ్‌బాక్ కార్లు, ఎస్‌యూవీలు, 7 సీటర్ కార్లు, 8 సీటర్ కార్లు , మిడ్‌సైజ్ ఎస్‌యూవీలు ఇలా చాలా రకాల కార్లు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్ అభిరుచి, బడ్జెట్‌ను బట్టి కార్లు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మిడ్‌సైజ్ ఎస్‌యూవీపై జనానికి ఆసక్తి పెరుగుతోంది. పూర్తి వివరాలు మీ కోసం..

దేశంలో క్రేజ్ సంపాదించుకున్న మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కొత్తగా హోండా ప్రవేశించింది. ఎలివేట్ కారుతో ఈ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చిన హోండా..హ్యుండయ్ కంపెనీతో పోటీ పడనుంది. ఎందుకంటే హోండా లాంచ్ చేసిన ఎలివేట్‌కు హ్యుండయ్ క్రెటా పోటీ ఇవ్వనుంది. దీనికి కారణం మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుండయ్ క్రెటా ఇప్పటికే పాతుకుపోయిందని చెప్పవచ్చు. ఇప్పటికే దేశీయ మార్కెట్‌లో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో గణనీయమైన వాటాను చేజిక్కించుకున్న హోండా క్రెటాతో ఏ మేరకు పోటీ ఇస్తుందనేది చూడాలి.

మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హోండా ఎలివేట్ ఇక నుంచి హ్యుండయ్ క్రెటాతో పోటీ పడనుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం హోండా ఎలివేట్ వర్సెస్ హ్యుండయ్ క్రెటా ఇంజన్ ప్రత్యేకతలు, ఆప్షన్లు చాలానే ఉన్నాయి. ఈ రెండింట్లో ఏ కారు ఇంజన్ ఆప్షన్లు ఎలా ఉన్నాయి ఏది బెస్ట్ అనేది పరిశీలిద్దాం..

హ్యుండయ్ క్రెటా ఇంజన్ ప్రత్యేకతలు

హ్యుండయ్ క్రెటాలో మొన్నటి వరకూ 3 ఇంజన్ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు మాత్రం కేవలం డబుల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంది. దాంతోపాచు 1.5 లీటర్ 4 సిలెండర్ డీజిల్ ఇంజన్ 116 పీఎస్, 250 ఎన్ఎం టార్క్ జనరేట్ చేసే సామర్ధ్యముంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్, డీజిల్ ఇంజన్ ఆప్షన్ రెండూ ఉన్నాయి. 

హోండా ఎలివేట్ ఇంజన్ ప్రత్యేకతలు

హోండా ఎలివేట్ ఎస్‌యూవీ 5వ జనరేషన్, సిటీ ప్లాట్‌ఫామ్ ఆధారితమైంది. హోండీ సిటీలో ఉండే ఇంజనే ఇందులో ఉంటుంది. 1.5 లీటర్, 4 సిలెండర్ నేచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 121 బీహెచ్ పి, 145 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇంజన్‌తో పాటు 6 స్పీడ్ మేన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ లెక్కన హోండా ఎలివేట్‌లో ఇంజన్ ఆప్షన్ ఒక్కటే అయినా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు రెండున్నాయి. అంటే క్రెటాతో పోలిస్తే పవర్ కాస్త ఎక్కువే. క్రెటా డబుల్ ఇంజన్ కావడంతో టార్క్ కూడా ఎక్కువ.

హ్యుండయ్ క్రెటాలో లభించే 1.5 లీటర్ 4 సిలెండర్ పెట్రోల్ ఇంజన్ 115 పీఎస్ పవర్, 143.8 ఎన్ఎం టార్క్ జనరేట్ స్తుంది ఈ కారు పవర్, టార్క్ ఎలివేట్‌తో పోలిస్తే చాలా తక్కువ. ఇందులో 6 స్పీడ్ మేన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ఉంటుంది.

Also read: Ather 450s Price: ఏథర్ 450s ఎలక్ట్రిక్‌ బైక్‌ లాంచింగ్‌ అప్పుడే..ప్రారంభమైన ప్రీ బుకింగ్స్‌, ధర ఎంతో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News