Home Loan Tips: ఇంటి రుణం విషయంలో ముఖ్య సూచనలు, తక్కువ వడ్డీ అందించే టాప్ 10 బ్యాంకులు

Home Loan Tips: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. స్థోమతను బట్టి ఎవరికి వారు ఇళ్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం ఉంటుంది. ఆర్ధికంగా ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు వివిధ బ్యాంకులు హోం లోన్స్ ఇస్తుంటాయి. ఆ వివరాలు పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 8, 2023, 09:22 PM IST
Home Loan Tips: ఇంటి రుణం విషయంలో ముఖ్య సూచనలు, తక్కువ వడ్డీ అందించే టాప్ 10 బ్యాంకులు

Home Loan Tips: దాదాపుగా ప్రతి బ్యాంకు హోమ్ లోన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతుంటాయి. వినియోగదారుడిని ఆకట్టుకునేందుకు ఆఫర్లు కూడా ఇస్తుంటాయి. ఆకర్షణీయమైన వడ్డీలు ప్రకటిస్తుంటాయి. మొదటిసారి హోమ్ లోన్ తీసుకునే వ్యక్తి చాలా విషయాలు తెలుసుకోవల్సివస్తుంది.

హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తెలుసుకోవల్సిన అతి ముఖ్యమైన విషయం వడ్డీ రేటు. ఏ బ్యాంకు ఎంత వడ్డీ వసూలు చేస్తుందో తెలుసుకోవాలి. బ్యాంకుల వడ్డీ అనేది కనీసం నుంచి గరిష్టం వరకూ వివిధ రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఏ రుణానికైనా వడ్డీ అనేది వ్యక్తిని బట్టి మారుతుంటుంది. ఆ వ్యక్తి ఎంత కాలంలో రుణం చెల్లిస్తాడు, అర్హతలేంటి, అతని క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తంను బట్టి మారుతుంటుంది. మీ వయస్సు, అర్హత, జీతం, ఆస్థులు, సేవింగ్ హిస్టరీ అన్నీ లోన్ తీసుకునేటప్పుడు పరిగణలో తీసుకుంటారు. అన్నింటికంటే ముఖ్యమైంది క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్. సిబిల్ స్కోర్ ఎంత బాగుంటే లోన్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. వడ్డీ కూడా అంత తక్కువగా ఉంటుంది.

అతి తక్కువ వడ్డీతో హోం లోన్ అందిస్తున్న టాప్ 10 బ్యాంకులు

ఇండస్ఇండ్ బ్యాంక్ కనీస వడ్డీ 8.4 శాతమైతే గరిష్టంగా 9.75 శాతం ఉంటుంది.
ఇండియన్ బ్యాంక్  కనీస వడ్డీ 8.45 శాతం కాగా, గరిష్ట వడ్డీ 9.1 శాతముంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు కనీస వడ్డీ 8.45 శాతమైతే గరిష్టంగా 9.85 శాతముంది.
యూకో బ్యాంకు కనీస వడ్డీ 8.45 శాతం కాగా, గరిష్టంగా 10.3 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా కనీస వడ్డీ 8.5 శాతం కాగా గరిష్ట వడ్డీ 10.5 శాతం
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కనీస వడ్డీ 8.6 శాతం కాగా గరిష్ట వడ్డీ 10.3 శాతం
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీస వడ్డీ 8.75 శాతం కాగా గరిష్ట వడ్డీ 10.5 శాతం
ఐడీబీఐ బ్యాంక్ కనీస వడ్డీ 8.75 శాతం కాగా, గరిష్ట వడ్డీ 10.75 శాతముంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కనీస వడ్డీ 8.8 శాతం వడ్డీ కాగా గరిష్ట వడ్డీ 9.45 శాతముంది
కోటక్ మహీంద్రా బ్యాంక్ కనీస వడ్డీ 8.85 శాతం కాగా, గరిష్ట వడ్డీ 9.35 శాతం వడ్డీ ఉంది

Also read: Samsung Galaxy F54 5G: శాంసంగ్ నుంచి మరో అద్భుత ఫోన్, లాంచ్ ఎప్పుడు, ధర, ప్రత్యేకతలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News