Google Maps New Feature: కొత్త ప్రదేశాలకు వెళ్లవాల్సి వచ్చినప్పుడు ఈ గూగుల్ మ్యాప్స్ ద్వారా మనం పోవాల్సిన ప్రదేశాన్ని సెర్చ్ చేస్తే ఒక మ్యాప్‌ను ఇస్తుంది. అయితే గూగుల్ ఇచ్చిన మ్యాప్ ద్వారా మనం వెళ్లాల్సిన ప్రదేశానికి సులభంగా వెల్లొచ్చు. అయితే ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ మరో కొత్త అప్‌డేట్‌ను యూజర్లకు పరిచయం చేసింది. మనం వెళ్లే దారుల్లో ఎక్కడైనా టోల్ ప్లాజాలు ఉన్నాయా? అక్కడి టోల్ ప్లాజాల వద్ద రేట్లు ఏంటి? అనే మొత్తం వివరాలను తెలిపేలా ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది గూగుల్ మ్యాప్స్. ఈ కొత్త ఫీచర్‌తో మనం ప్రయాణం ప్రారంభించడానికి ముందే టోల్ వద్ద కట్టే మొత్తాన్ని తెలుసుకోవచ్చని గూగుల్ మ్యాప్స్ తెలిపింది.
అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో టోల్ చెల్లించే అవసరం లేకుండా మరో రూట్ ఏదైనా ఉందా? అనే వివరాలను కూడా తెలుసుకొని రూట్ మార్చుకునే అవకాశాలను గూగుల్ మ్యాప్స్ యూజర్లకు అందించింది. అయితే గూగుల్ మ్యాప్స్ తీసుకువచ్చే కొత్త ఫీచర్‌తో టోల్ గేట్లు ఉన్న రూట్లతో పాటు లేని రూట్లను వినియోగారులు ఎంచుకోవచ్చని తెలిపింది. ఈ సరికొత్త ఫీచర్‌తో టోల్ గేట్లలో తాజా ధరల వివరాలను తెలుసుకోవచ్చు.టోల్ రేట్లను అంచనా వేసుకొని సులువుగా ప్రయాణం కొనసాగించవచ్చని తాజాగా గూగుల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
దీనిని ఎలా వాడాలి..?
ఈ గూగుల్ మ్యాప్స్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ విడుదలయ్యాక మ్యాప్స్‌లోకి వెళ్లి పైభాగంలోని కుడివైపున ఉన్న త్రీ డాట్స్ మెనూ ఆప్షన్‌పై నొక్కాలి. అందులోనే రూట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అవైడ్ టోల్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుందని సంస్థ పెర్కొంది. ఈ ఆప్షన్ ఐఫోన్, యాపిల్ వాచ్‌ల్లోనూ వినియోగించుకొవచ్చు. అయితే గూగుల్ మ్యాప్స్ ద్వారా మెరుగైన నావిగేషన్‌ను ఐఫోన్, యాపిల్ వాచ్ యూజర్లకు గూగుల్ అందుబాటులోకి తీసుకురానుందని సమాచారం. యాపిల్ వాచ్‌లో ఇందుకోసం మ్యాప్స్‌లోని యాపిల్ ఇకోసిస్టమ్ యూజర్ ట్రిప్‌లకు సంబంధించి ప్రత్యేక విడ్జెట్‌ను యాపిల్ వాచ్ నుంచి చూపిస్తుందని గూగుల్ మ్యాప్స్ తెలిపింది.
ఈ కొత్త ఫీచర్ సిరి వాయిస్ అసిస్టెంట్ సాయంతో నేరుగా గూగుల్ మ్యాప్స్ నావిగేషన్‌ను పొందే సౌకర్యాన్ని కూడా ఈ అప్‌డేట్‌లో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. యాపిల్ వాచ్ వినియోగదారులు ఇక నుంచి ఐఫోన్ ఉపయోగించకుండా నేరుగా వాచ్‌లోనే గూగుల్ మ్యాప్స్ నావిగేషన్స్‌ను ఓపెన్ చేసుకోని వినియోగించుకోవచ్చు. యాపిల్ యూజర్లు తమ వాచ్‌కి టేక్ మీ హోమ్ కాంప్లికేషన్‌ను గూగుల్ మ్యాప్స్‌లో నావిగేట్ చేసుకోవచ్చని గూగుల్ సంస్థ తెలిపింది.అయితే వినియోగదారులకు గూగుల్ మ్యాప్స్ ఈ కొత్త అప్‌డేట్‌ను ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. భారత్‌లోనే కాకుండా అమెరికా, జపాన్, ఇండోనేషియాతో సహా పలు దేశాల్లో ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వినియోగదారులు కొత్త ఫీచర్‌ను పొందేందుకు గూగుల్ మ్యాప్స్ లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఇలాంటి కొత్త ఫీచర్లలను మున్ముందు తీసుకురానునట్లు గూగుల్ మ్యాప్స్ తెలిపింది.
Also Read: EPF Interest Credit: EPFO ఖాతాలో వడ్డీ ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి ఇలా చేయండి!
Also Read: World Health Day: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ 5 అలవాట్లు తప్పనిసరి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook