TSPSC-RIMC Notification: కేంద్రం ప్రభుత్వం ఈ సంవత్సరం ఉత్తరాఖండ్ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో జనవరి 2025 టర్మ్ నోటిఫికేషన్ విడదల చేసింది. అయితే ఈ ప్రవేశాల కోసం టీఎస్‌పీఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది. ముందుగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తరువాత ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవాలి..?
గుర్తింపు పొందిన స్కూల్స్ నుంచి 2025 జనవరి నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి పాస్ అయిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 01 జవవరి 2025 నాటికి పదకొండున్నర సంవత్సరాలకు తగ్గకుండా.. 13 ఏళ్లకు మించకుండా ఉండాలి. 02.01.2012 - 01.07.2013 మధ్య జన్మించిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసువాలి.
ఎంపిక విధానం ఇలా..
ఎంట్రన్స్ టెస్ట్, వైవా వోస్, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఎంట్రన్స్ ఎగ్జమ్ ఇలా..
ఇందులో మొత్తం ౩ పేపర్లు ఉంటాయి. మొదటిగా గణితం-200 మార్కులు, జనరల్ నాలెడ్జ్-75 మార్కులు, అంగ్లం-125 మార్కులు ఉంటాయి. ఈ రిటన్ ఎగ్జమ్‌లో పాస్ అయన వారికి మాత్రమే వైవా వోస్- 50 మార్కులు నిర్వహిస్తారు. ఎంట్రన్స్ టెస్ట్, వైవా వోస్ కలిపి మొత్తం 450 మార్కులకు ఉంటుంది.
విద్యార్థులు కనీసం వీటిలో 50 శాతం మార్కులు పొందాలి. ఈ రెండింటిలో పాస్ అయన వారని అభ్యర్థులకు చివరిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు.
అప్లికేషన్ ధర:
జనరల్ అభ్యర్థులకు రూ.600
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555
అప్లికేషన్ విధానం:
ఆఫ్‌లైన్ ద్వారా దీని దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ధర ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఆర్ఐఎంసీ పంపిన దరఖాస్తు ఫారం నింపి కావాల్సిన ధ్రువతపత్రాలు జతచేసి హైదరాబాద్‌లోని టీఎస్‌పీఎస్సీకి పంపించాలి.
తేదీలు:
దరఖాస్తుకు చివరి తేది: 15.04.2024.
ఎగ్జమ్ తేది: 01-06-2024.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
TSPSC-RIMC: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. టీఎస్‌పీఎస్సీ- ఆర్‌ఐఎంసీ నోటిఫికేషన్ వచ్చేసింది