వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టిన బంగారం, పసిడి ధరలు.

Edited by - ZH Telugu Desk | Last Updated : May 12, 2022, 01:32 PM IST
  • పసిడి ప్రియులకు మరో శుభవార్త
  • ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి
  • వరుసగా రెండో రోజూ కూడా పసిడి ధరలు తగ్గుముఖం
వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టిన బంగారం, పసిడి ధరలు.

Gold Price Today, 12 May 2022 పసిడి ప్రియులకు మరో శుభవార్త. ఈరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. వరుసగా రెండో రోజూ కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వెండి ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గడంతో.. బంగారం ధర రూ.47 వేలకు పడిపోయింది. దీంతో ఇప్పుడు తులం బంగారం రూ.46,750కే లభ్యం అవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.380 తగ్గింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా బాగా తగ్గాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ.1,300 తగ్గిపోయింది. దీంతో ఇప్పుడు హైదరాబాద్‌లో రూ.64,800కే కేజీ  వెండి లభిస్తోంది.

దేశ రాజధానిలో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.350 తగ్గింది. దీంతో రూ.46,750కే బంగారం లభిస్తోంది. 24 క్యారెట్ల తులం బంగారం రూ.380 తగ్గి రూ.51 వేలుగా నమోదు అయిది. వెండి అయితే ఏకంగా రూ.1,500 పతనమై రూ.60,400కు దిగి వచ్చింది. ఇక బెజవాడలో బంగారం ధరలు కూడా డౌన్ ట్రెండ్‌లోనే నడుస్తున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.350 తగ్గడంతో.. ఈ రేటు రూ.46,750గా నమోదైంది. ఇక 24 క్యారెట్ల తులం బంగారం రూ.380 తగ్గి రూ.51 వేలు పలుకుతోంది. వెండి ధర విజయవాడలో రూ.1300 తగ్గి... కేజీ రూ.64,800లకు లభిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో కూడా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మిగతా మార్కెట్లతో పోలిస్తే చెన్నైలో బంగారం ధర భారీగా పతనమైంది. 22 క్యారెట్ల తులం బంగారం చెన్నై మార్కెట్లో రూ.590 తగ్గింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన తులం బంగారం రూ.640 తగ్గి..రూ.52,220కు మార్కెట్లో లభిస్తోంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా చెన్నైలో వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి.  కిలో వెండి ధర రూ.1,300 తగ్గిపోయింది. దీంతో కేజీ వెండి రూ.64,800లకు లభిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఔన్స్ ప్రస్తుతం 1,832 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

also read  BANK RULES ఇరవై లక్షలు దాటి నగదు జమ చేసిన , విత్ డ్రా చేసిన కొత్త రూల్స్ పాటించాల్సిందే

alsor read Bangladesh నిలకడగా పురోగమిస్తున్న బంగ్లాదేశ్... భారత్‌ను మించి తలసరి ఆదాయం నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

 

Trending News