Forbes richest persons List 2023: ఆసియా కుబేరుడిగా మళ్లీ ముకేష్ అంబానీ.. ఫోర్బ్స్ జాబితా నుంచి అదానీ అవుట్

Forbes Richest persons List 2023: భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ మరోసారి ఆసియాలో అత్యధిక సంపన్నుడిగా నిలిచారు. మరోవైపు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ జాబితాలో కిందకు జారిపోయారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 7, 2023, 02:16 PM IST
Forbes richest persons List 2023: ఆసియా కుబేరుడిగా మళ్లీ ముకేష్ అంబానీ.. ఫోర్బ్స్ జాబితా నుంచి అదానీ అవుట్

Forbes Richest persons List 2023: ప్రపంచ కుబేరుల జాబితాను ప్రతియేటా విడుదల చేసే ప్రఖ్యాత మేగజీన్ ఫోర్బ్స్ మరోసారి 2023 కోటీశ్వరుల జాబితాను విడుదల చేసింది. గతంలో టాప్‌లో ఉన్న అదానీ కిందకు జారిపోగా, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మరోసారి ఆసియా జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఫోర్బ్స్ జాబితా ప్రకారం రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ మరోసారి ఆసియాలో అత్యంత ధనికుల జాబితాలో చేరారు. ఈ జాబితాలో గౌతమ్ అదానీ స్థానం కిందకు పడిపోయింది. అంబానీకు పోటీగా ఉన్న గౌతమ్ అదానీ జాబితాలో 24వ స్థానానికి పడిపోయారు. జనవరి 24వ తేదీ వరకూ ప్రపంచ కుబేరుల్లో మూడవ స్థానలో ఉన్న గౌతమ్ అదానీ..సంపద అప్పుడు 126 బిలియన్ డాలర్లు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం అతని సంపద అత్యంత వేగంగా క్షీణించింది.

అదానీ మొత్తం సంపద ఇప్పుడు 47.2 బిలియన్ డాలర్లకు పడిపోయిందని ఫోర్బ్స్ తెలిపింది. దేశీయ కుబేరుల్లో ముకేష్ అంబానీ తరువాతి స్థానం గౌతమ్ అదానీదేనని ఫోర్బ్స్ వెల్లడించింది. అంబానీ సంపద ఇప్పుడు 83.4 బిలియన్ డాలర్లు కాగా, ప్రపంచ కుబేరుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. గత ఏడాది ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీ 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం సాధించే తొలి భారతీయ కంపెనీగా ఉంది. రిలయన్స్ వ్యాపారం ఆయిల్, టెలీ కమ్యూనికేషన్స్, రిటైల్ రంగాల్లో ఉంది.

Also Read: PNG CNG Gas Price: 10% వరకు తగ్గనున్న పీఎన్‌జీ-సీఎన్‌జీ గ్యాస్‌ ధరలు.. కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

ఫోర్బ్స్ జాబితా ప్రకారం

ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలోని 25 మంది ధనికుల మొత్తం సంపద 2100 బిలియన్ డాలర్లు. ఈ సంఖ్య 2022లో 2300 బిలియన్ డాలర్లుగా ఉంది. ప్రపంచంలోని 25 మంది ధనికుల్లో మూడవ వంతు మంది సంపద గత ఏడాది దారుణంగా క్షీణించింది.

ఫోర్బ్స్ జాబితాలో భారతీయులు

ఈ జాబితా ప్రకారం శివ్ నాడార్ దేశంలోని మూడవ కుబేరుడిగా ఉన్నారు. నాలుగవ స్థానంలో సైరస్ పూణావాలా ఉన్నారు. ఇస్పాత్ స్టీల్ అధినేత లక్ష్మీ మిట్టల్ 5 వ స్థానంలో ఓపీ జిందాల్  6వ స్థానంలో సన్ ఫార్మా దిలీప్ సాంఘ్వీ 7వ స్థానంలో డీమార్ట్ రాధాకృష్ణ దమానీ 8వ స్థానంలో ఉన్నారు.

Also Read: Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు, త్వరలో స్లీపర్ కోచ్‌లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News