/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

Fact Check: ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇకపై వినియోగిస్తే జేబుకు చిల్లు పడుతుందని..అదనపు ఛార్జీలు పడతాయనే వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. యూపీఐ చెల్లింపులపై నిజంగానే అదనపు ఛార్జీలు విధిస్తున్నారా, ఆర్బీఐ ఆమోదం ఉందా లేదా, అసలు ఎన్‌పీసీఐ ఏమంటోంది, నిజానిజాలేంటో తెలుసుకుందాం..

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ద్వారా చెల్లించే మర్చంట్ లావాదేవీలపై ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్టుమెంట్స్ ఛార్జ్ అంటే పీపీఐ రుసుము వసూలు చేయాలనే ప్రతిపాదన ఉంది. ఫలితంగా అందరిలో ఆందోళన అధికమైంది. అదే పనిగా యూపీఐ చెల్లింపులు చేయడాన్ని నియంత్రించుకోకపోతే జేబుకు చిల్లు పడవచ్చనే భయం. ఎందుకంటే ఎన్‌పీసీఐ జారీ చేసిన ఓ సర్క్యులర్ ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి యూపీఐ లావాదేవీలతో జరిగే మర్చంట్ చెల్లింపులపై పీపీఐ ఛార్జ్ పడనుంది. 

2 వేలు దాటితే 1.1 శాతం సర్‌ఛార్జ్ ప్రతిపాదన ఉందా?

ఎన్‌పీసీఐ జారీ చేసిన సర్క్యులర్‌లో 2 వేల రూపాయాలు దాటిన లావాదేవీలపై  ఏప్రిల్ 1 నుంచి 1.1 శాతం సర్‌చార్జ్ వసూలు చేసేందుకు ప్రతిపాదన ఉంది. ఈ రుసుమును మర్చంట్ లావాదేవీలు అంటే వ్యాపారులకు చెల్లింపు చేసే కస్టమర్లు ఇవ్వాల్సి ఉంటుంది. పీపీఐలో వాలెట్ లేదా కార్డ్ ద్వారా జరిపే లావాదేవీలు ఉంటాయి. సాధారణంగా ఇంటర్‌ఛేంజ్ ఫీజు కార్డు కార్డు పేమెంట్స్‌కు సంబంధించి ఉంటుంది. 

సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ?

అయితే ఈ కొత్త నిబంధనలు వ్యక్తిగత యూపీఐ చెల్లింపులపై ప్రభావం చూపించదు. పీపీఐ ఇన్‌స్ట్రుమెంట్స్ అయిన మొబైల్ వ్యాలెట్స్ ద్వారా వ్యాపారులకు 2 వేల కంటే ఎక్కువ చెల్లిస్తేనే ఈ అదనపు ఛార్జ్ వర్తిస్తుంది. వ్యక్తిగత యూపీఐ చెల్లింపులపై యూపీఐ అదనపు ఛార్జీలు వర్తించవు. 

ఇంకా ఆమోదించని ఆర్బీఐ

అయితే ఎన్‌పీసీఐ ఈ కొత్త ప్రతిపాదనల్ని ఆర్బీఐకు సమర్పించింది. ఆర్బీఐ ఈ ప్రతిపాదనల్ని ఆమోదిస్తేనే ఈ సర్ చార్జీలు అమల్లోకి వస్తాయి. ఆర్బీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఒకవేళ ఆర్బీఐ ఈ ప్రతిపాదనల్ని ఆమోదిస్తే పీపీఐ ప్రొవైడర్లు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది. 

ఎన్‌పీసీఐ వివరణ

యూపీఐ చెల్లింపులు భారంగా మారుతున్నాయనే వార్తల నేపధ్యంలో ఎన్‌పీసీఐ వివరణ జారీ చేసింది. యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఉచితమని, సెక్యూర్ అని వెల్లడించింది. అసలు సంగతేంటంటే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే పీపీఐ వ్యాలెట్స్ ఇకపై యూపీఐ ఈకో సిస్టమ్‌లో భాగంగా ఉండేందుకు అనుమతి లభించింది. దీని ప్రకారం ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు పీపీఐ ఆధారిత వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ యూజర్లకు కానేకాదు. సాధారణ యూపీఐ చెల్లింపులు, బ్యాంక్ నుంచి బ్యాంకు బదిలీలకు ఏ విధమైన ఛార్జీలు ఉండవు. 

Also read: UPI Payment Surcharges: ఫోన్‌పే, గూగుల్ పే వాడుతున్నారా, మీ జేబుకు చిల్లు పడుతుంది జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Fact check on npci levy charges on upi payments using phone pe, google pay and paytm etc, what is reality, is rbi approved here know the npci statement
News Source: 
Home Title: 

Fact Check: ఫోన్‌పే, గూగుల్ పే చెల్లింపులపై ఛార్జీలున్నాయా, అసలు నిజమేంటి

Fact Check: ఫోన్‌పే, గూగుల్ పే చెల్లింపులపై ఛార్జీలున్నాయా, అసలు నిజమేంటి, ఎన్‌పీసీఐ ఏమంటోంది
Caption: 
NPCI Payments ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Fact Check: ఫోన్‌పే, గూగుల్ పే చెల్లింపులపై ఛార్జీలున్నాయా, అసలు నిజమేంటి
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Wednesday, March 29, 2023 - 14:38
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
122
Is Breaking News: 
No