Cheapest Recharge Plan: రూ.75 తో కాలింగ్, డేటా అది కూడా 30 రోజుల వరకు..!

Cheapest Recharge Plan: ట్రాయ్​ సూచనల మేరకు జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియాలు ఇటీవల 30 రోజుల ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చాయి. వీటన్నింటికన్న తక్కువ ధరలో బీఎస్​ఎన్​ఎల్​ అందిస్తున్న బెస్ట్​ ప్లాన్స్​ ఇప్పుడు చూద్దాం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 10, 2022, 07:20 PM IST
  • తక్కువ ధరలో 30 రోజుల మొబైల్ రీఛార్జ్​ ప్లాన్​
  • దిగ్గజ టెల్కోలకు పోటీపగా అందుబాటులోకి..
  • బీఎస్​ఎన్​ఎల్​ నుంచి చౌక ధరలో..
Cheapest Recharge Plan: రూ.75 తో కాలింగ్, డేటా అది కూడా 30 రోజుల వరకు..!

Cheapest Recharge Plan: దేశంలో దిగ్గజ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్​ఐడియాలు ఇటీవల 30 రోజుల ప్లాన్​ను అందుబుటాలోకి తెచ్చాయి. జియో రూ.256 రూపాయలతో ప్లాన్​ను అందుబాటులోకి తేగా.. ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియాలు రెండు ప్లాన్​ల చొప్పున అందుబాటులోకి తెచ్చాయి.

ఇప్పుడు ప్రైవేటు దిగ్గజ టెలికాం సంస్థలకు పోటీగా.. ప్రభుత్వ రంగ టెల్కో బీఎస్​ఎన్​ఎల్ అత్యంత చౌకైన ప్లాన్​లు అందుబాటులో ఉన్నాయి. 30 రోజుల వ్యాలిడిటీతో..  బీఎస్​ఎన్​ఎల్​ అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్ ఇప్పుడు చూద్దాం.

బీఎస్​ఎన్​ఎల్​ మూడు ధరల్లో (రూ.75, రూ.24, రూ.102) 30 రోజుల ప్లాన్స్​ను అందిస్తుంది..

రూ.75 ప్లాన్​లో ప్రయోజనాలు..

బీఎస్​​ఎన్​ఎల్​ అందిస్తున్న ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో డేటా, కాలింగ్​ సహా పలు ప్రయోజనాలు ఉన్నాయి. 30 రోజుల పాటు.. 200 నిమిషాల కాలింగ్​ సదుపాయం, 2జీబీ డేటా సహా ఉచిత కాలర్ ట్యూన్​ సదుపాయాలను వాడుకోవచ్చు. ఇంట్లో అవసరాలకు మాత్రమే ఫోన్ వాడే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.

రూ.24 ప్లాన్​తో..

రూ.24 ప్లాన్​లో డేటా, ఎస్​ఎంఎస్​ సదుపాయాలు ఉండవు. అయితే ఈ ప్లాన్​ల్​తో రీఛార్జ్ చేసుకుంటే.. కాలింగ్​కు నిమిషానికి 20 పైసల చొప్పున మాత్రమే వసూలు చేస్తుంది. ఈ సదుపాయం 30 రోజులు అందుబాటులో ఉంటుంది. కేవలం ఇన్​కమింగ్ కోసమే మొబైల్ ఫోన్​ వాడే వారకి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.

రూ.102 ప్లాన్​తో డేటా, కాలింగ్, ఎస్​ఎంఎస్​లు..

బీఎస్​ఎన్​ఎల్​ అందిస్తున్న రూ.102 ప్లాన్​తో కాలింగ్​, డేటా, ఎస్​ఎంఎస్​ సదుపాయాలు పొందొచ్చు. ఈ ప్లాన్​తో రీఛార్జ్ చేసుకుంటే.. 30 రోజులకు 6 వేల వాయిస్ సెకన్ల కాలింగ్​ సదుపాయం, 1 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు వినియోగించుకోవచ్చు. డేటాతో ఎక్కువగా అవసరం లేకుండా కేవలం తక్కువ సమయం కాల్స్ మాట్లాడే వారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది.

Also read: PAN Aadhaar: ఇంకా పాన్​-ఆధార్​ లింక్ చేయలేదా? ఈ విషయాలు తెలుసుకోండి ఇప్పుడే..

Also read: FASTag collections: రికార్డు స్థాయిలో ఫాస్టాగ్ వసూళ్లు..మార్చిలో ఎంతంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News