Cheap and Best Hatchback Car: SUV డిజైన్‌తో బెస్ట్ Hatchback కారు, ధర కూడా చాలా తక్కువ

Cheap and Best Hatchback Car: ప్రతి ఒక్కరికీ సొంతంగా కారు ఉండాలని ఉంటుంది. కానీ బడ్జెట్ సహకరించ వెనుకడుగు వేస్తుంటారు. అయితే అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరలోనే బెస్ట్ హ్యాచ్ బ్యాక్ కారు అందుబాటులో ఉంది. ఆ కారు వివరాల గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 4, 2024, 09:55 AM IST
Cheap and Best Hatchback Car: SUV డిజైన్‌తో బెస్ట్ Hatchback కారు, ధర కూడా చాలా తక్కువ

Cheap and Best Hatchback Car: ఇండియాలో రెనాల్ట్ కార్లకు మంచి ఆదరణే ఉంది. ఫీచర్లు బాగుండటం, ధర తక్కువగా ఉండటంతో అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే రెనాల్ట్ కంపెనీకు చెందిన రెనాల్ట్ క్విడ్ కారుకు భారతీయ మార్కెట్లో చాలా క్రేజ్ ఉంది. అద్భుతమైన ఫీచర్లు ఉండటమే కాకుండా చాలా తక్కువ ధరకే లభిస్తుండటం ప్రధాన కారణం. రెనాల్ట్ క్విడ్ ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.

రెనాల్ట్ క్విడ్ బెస్ట్ హ్యాచ్ బ్యాక్ కారుగా ప్రాచుర్యం పొందుతోంది. చిన్న కారు కావడంతో ఇరుకైన ట్రాఫిక్ రోడ్లలో కూడా సునాయసంగా వెళ్లగలుగుతుంది. ఈ కారు 799 సిసి పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. 53 బీహెచ్ పి పవర్, 72 ఎన్ఎం టార్క్ జనరేట్ చేయగలదు. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్ ట్రాన్స్ మిషన్ అందుబాటులో ఉంది. రెనాల్ట్ క్విడ్ మైలేజ్ దాదాపుగా 22-25 కిలోమీటర్లు ఇస్తుంది. మైలేజ్ పరంగా బెస్ట్ కారు ఇది. ఈ కారు డిజైన్ SUVని పోలి ఉంటుంది. దాంతో గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంటుంది. బాడీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్ , స్టైలిష్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. 

ఇక ఈ కారులో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమేరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ విషయానికొస్తే లెగ్ రూమ్, హెడ్ రూమ్ తగినంతగా ఉంటుంది. దాంతో దూర ప్రయాణాలకు కూడా అనువుగా ఉంటుంది. ఇక సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ వంటి ఫీచర్లు ఉన్నాయి. మంచి మైలేజ్, స్టైలిష్, తక్కువ ధరకు లభించే కారు కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ కారు ధర కేవలం 4.60 లక్షల రూపాయలే. 

Also read: Best 7 Seater Cars: 10 లక్షల బడ్జెట్లో టాప్ 5 బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News