ఎలన్ మస్క్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన రైతు

Edited by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 02:19 PM IST
  • సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది
  • ట్విటర్‌ ఆఫీస్‌ను షిప్ట్‌ చేయాలని ఎలన్‌మస్క్ భావిస్తున్నారటా
  • టెక్సాస్‌ కు ా మార్చాలని భావిస్తున్నారట
ఎలన్ మస్క్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన రైతు

elanmusk ఎలన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సోషల్ మీడియాలో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. ముందు టెస్లా షేర్ల అమ్మకం పై వార్తలు వస్తే ఆతర్వాత సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ తొలగింపు హల్ చల్ చేసింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న మరో వార్త ఏమిటంటే ... ట్వీట్టర్ ఆఫీస్ మార్చడం. అవును ట్విటర్‌ ఆఫీస్‌ను షిప్ట్‌ చేయాలని ఎలన్‌మస్క్ భావిస్తున్నారటా....

ఈ వార్త తెలుసుకున్న టెక్సాస్‌ లోని ఆస్టిన్‌ నగరానికి చెందిన రైతు జిమ్ స్క్వెర్ట్నర్..మస్క్‌ను ట్వీట్ చేశాడు. ఎలన్‌ మస్క్‌కు బంపర్ ఆఫర్  ఇచ్చాడు.  కాలిఫోర‍్నియాలోని ట్విటర్‌ కార్యాలయాన్ని  టెక్సాస్‌ రాష్ట్రం ఆస్టిన్‌ నగరానికి మారిస్తే తన వంతు సాయంగా  విలియమ్‌సన్‌ కౌంటీలో తనకు ఉన్న వంద ఎకరాల భూమిని ఉచితంగా ఇస్తానని ట్వీట్ చేశాడు. ఇక తాను విలియన్సన్‌ కౌంటీలో ఆఫర్ చేసిన వంద ఎకరాల భూమి.... ఆస్టిన్‌ నుంచి గంట జర్నీ చేస్తే వచ్చేస్తుందని ట్వీట్ చేశాడు. ఇక మస్క్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చిన జిమ్ ష్వెర్ట్‌నర్ కు ఏకంగా 20వేల ఎకరాల భూమి ఉంది. 

ఒక వేళ ఈ ప్రపోజల్‌ ఎలన్‌ మస్క్‌కు నచ్చితే ట్విటర్‌ ఆఫీస్‌ను కాలిఫోర్నియా నుంచి టెక్సాస్‌కు మారడం ఖాయం అవుతుంది. మస్క్‌ కూడా ట్వీట్టర్‌ ఆఫీసును టెక్సాస్‌ రాష్ట్రంలో కొనసాగించాలని భావిస్తున్నారట. మస్క్‌కు చెందిన మూడు కంపెనీలు టెక్సాస్‌ రాష్ట్రంలోనే ఉండడంతో ట్వీట్టర్ కార్యాలయాన్ని కూడా టెక్సాస్‌కు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారట. తన వ్యాపారాలు అన్నీ ఒకే చోట ఉంటే ప్రయాణం తగ్గుతుందని ఆయన భావిస్తున్నారట. సమయం డబ్బు రెండు ఆదా అవుతాయని మస్క్ భావిస్తున్నారట. అయితే ఈపాటికే చాలా మంది ఉద్యోగులు కాలిఫోర్నియాలో సెటిల్ అవ్వడంతో వీళ్లల్లో ఎంత మంది టెక్సాస్‌కు షిఫ్ట్ అవుతారని మస్క్‌ లెక్కలు వేసుకుంటున్నారట. ఒక వేళ ఉద్యోగులు రాకపోతే టెక్సాస్‌లో అంతటి నిపుణులైన ఉద్యోగులు దొరుకుతారా లేదా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారట. ఇది ఇలా ఉండగా  టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ కూడా ఎలన్‌ మస్క్‌కు మరో ఆఫర్ ఇచ్చారు. ట్టీట్టర్ కార్యాలయాన్ని టెక్సాస్ మార్చితే క్యాంపస్ ఏరియాను తను ఫ్రీ స్పీచ్‌ జోన్‌గా ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. 
 

also read బ్యాంక్‌ ఆఫ్ బరోడా శుభవార్త ... తక్కువ వడ్డీ రేట్లకే కారు లోన్స్

also read  Whatsapp: భారతీయ యూజర్లకు వాట్సప్ షాక్, 18 లక్షల ఖాతాలు బ్యాన్, కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News