7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మరో పదిరోజుల్లో డీఏపై స్పష్టత

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందనే విషయంపై త్వరలో స్పష్టత రానుంది. ఏడాదిలో జరగాల్సిన రెండవ దఫా డీఏ పెంపు ఎంతనేది మరో పదిరోజుల్లో తేలనుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 20, 2023, 07:45 PM IST
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, మరో పదిరోజుల్లో డీఏపై స్పష్టత

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతియేటా రెండుసార్లు జనవరి, జూలై నెలల్లో డీఏ పెరుగుతుంటుంది. జనవరి డీఏ 4 శాతం పెరగగా ఇక జూలై ఎంత పెరుగుతుందనే విషయంపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. డీఏ పెంపు ఎంత ఉంటుందనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం జూలై 2023లో మరోసారి డీఏ పెంచనుంది. కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసీపీఐ గణాంకాల ఆధారంగా డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం మే, జూన్ నెలల ఏఐసీపీఐ గణాంకాలు వెల్లడి కావల్సి ఉంది. వీటి ఆధారంగా జూలై నెలలో డీఏ ఎంత పెరగవచ్చనేది అంచనా వేయవచ్చు. అంటే జూన్ 30 న విడుదల కానున్న ఏఐసీపీఐ ఇండెక్స్ మే, జూన్ నెలల గణాంకాల ఆధారంగా జూలైలో డీఏ పెంపు ఎంతనేది తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై నెలలో కరవుభత్యం పెరగాల్సి ఉంది. జనవరి 2023లో 4 శాతం డీఏ పెంచడంతో మొత్తం డీఏ 42 శాతానికి చేరుకుంది. ఈసారి అంటే జూలైలో కూడా 4 శాతం పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. కచ్చితంగా ఎంతనేది జూన్ 30 విడుదలయ్యే మే, జూన్ నెలల ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా లెక్కకట్టవచ్చు.

కేంద్ర కార్మిక శాఖ ప్రతి నెలా ఏఐసీపీఐ ఇండెక్స్ విడుదల చేస్తుంటుంది. ఈ ఇండెక్స్ ఆధారంగా ప్రతి యేటా రెండుసార్లు అంటే జనవరి, జూలై నెలల్లో డీఏ పెంచాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ధరల పెరుగుదల ఎంత ఎక్కువ ఉంటే కరవు భత్యం అంతగా పెరగవచ్చు. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ లెక్కింపును కేంద్ర కార్మిక శాఖ చేస్తుంది. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఈ గణన జరుగుతుంది.

జూన్ 30 వతేదీన వెల్లడయ్యే గణాంకాలను బట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారి డీఏ ఎంత పెంచుతుందనేది నిర్ణయించవచ్చు. అటు విశ్లేషకులు మాత్రం ఈసారి కూడా డీఏ 4 శాతం పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఏఐసీపీఐ ఇండెక్స్ 135కు చేరుకుంటే మాత్రం డీఏలో భారీ పెరుగుదల రావచ్చు. అంచనా వేసినట్టే ఒకవేళ ఏఐసీపీఐ ఇండెక్స్ 135 చేరుకుంటే ఉద్యోగుల డీఏ కచ్చితంగా 4 శాతం పెరగవచ్చు. అంటే 42 నుంచి డీఏ 46 శాతానికి చేరనుంది. అంటే ఉద్యోగుల జీతం కూడా భారీగా పెరగనుంది. 

ఒకవేళ ఓ ప్రభుత్వ ఉద్యోగి కనీస జీతం 18 వేల రూపాయలుంటే..42 శాతం డీఏ అంటే 7560 రూపాయులు లభిస్తుంది. కానీ జూలై నెలలో 4 శాతం పెంచి 46 శాతానికి మొత్తం డీఏ చేరుకుంటే 8280 రూపాయలు డీఏ లభిస్తుంది. ఇది వార్షిక డీఏ. నెలకు లెక్కగడితే 720 రూపాయలు జీతం పెరగనుంది.

Also read: Maruti Eeco: కేవలం 5.27 లక్షలకే 7 సీటర్ కారు, ఎర్టిగా, ఇన్నోవాలకు దెబ్బే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News