AP Politics: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే చాలామంది పార్టీని వీడగా ఇవాళ ఒకేసారి ఇద్దరు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. ఒకరు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కాగా మరొకరు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకు నేతలు కరువయ్యే పరిస్థితి ఉండవచ్చు.
ఓ వైపు పార్టీని పటిష్టం చేస్తూ ప్రజల్లో వెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రయత్నిస్తుంటే మరోవైపు నేతలు పార్టీ వీడుతున్నారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆళ్ల నాని ఇప్పటికే పార్టీని వీడగా ఇవాళ మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. ఇవాళ ఉదయం భీమిలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తూ అధినేత వైఎస్ జగన్‌కు లేఖ పంపించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నందున పార్టీకు రాజీనామా చేస్తున్నానన్నారు. అవంతి శ్రీనివాస్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకునేలోగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేశారు.
2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ జనసేనాని పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించి జెయింట్ కిల్లర్ అన్పించుకున్నారు. అయితే ఇటీవల జరిగిన 2024 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అప్పట్నించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గ్రంథి శ్రీనివాస్ రాజీనామా లేఖను జగన్‌కు పంపించారు.
ఇవాళ రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్, గ్రంథి శ్రీనివాస్ ఇద్దరూ జనసేనతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏలూరు ఆళ్ల నాని కంటే ముందు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. అప్పట్నించి రాజీనామాల పరంపర కొనసాగుతోంది. ఇదే కొనసాగితే పార్టీలో నాయకులు కొరవడే అవకాశముంది.
Also read: YCP India Alliance: ఇండియా కూటమిలో వైసీపీ, మమత నాయకత్వానికి మద్దతు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.