YS Vijayamma: వైఎస్ విజయమ్మ సంచలన వీడియో.. జగన్‌ హత్యాయత్నంపై ఖండన

YS Vijayamma Video: తన హత్యకు వైస్‌ జగన్‌ కుట్ర చేశారని వస్తున్న వార్తలపై వైఎస్‌ విజయమ్మ సంచలన ప్రకటన చేశారు. తప్పుడు వార్తలు ప్రచారం కావడాన్ని ఖండించారు. అసత్య వార్తలు రాస్తున్న వారికి స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 5, 2024, 11:01 PM IST
YS Vijayamma: వైఎస్ విజయమ్మ సంచలన వీడియో.. జగన్‌ హత్యాయత్నంపై ఖండన

YS Vijayamma Accident: కారు ప్రమాదంతో తన హత్యకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కుట్ర పన్నాడని జరుగుతున్న ప్రచారంపై వైఎస్‌ విజయమ్మ ఖండించారు. ఇప్పటికే లేఖ రాయగా అది కూడా అసత్యమని ప్రకటించడాన్ని తప్పుబట్టారు. భేదాభిప్రాయాలు ఉంటాయని కానీ హత్య చేసుకునేంత లేదని.. తన పిల్లలను ఎంతో సంస్కారవంతంగా పెంచానని విజయమ్మ తెలిపారు. తమ కుటుంబ వివాదాలపై బయట జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై తప్పుడు వార్తలు రాసే వారిని వదిలిపెట్టనని.. న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు.

Also Read: YS Vijayamma: కారు ప్రమాదం వార్తలపై కలత.. టీడీపీ సోషల్ మీడియాకు ఇచ్చిపడేసిన వైఎస్‌ విజయమ్మ

రెండేళ్ల కిందట కర్నూలులో విజయమ్మ కారు ప్రమాదానికి గురయితే అది జగన్‌ హత్య చేసేందుకు పన్నిన కుట్ర అని టీడీపీ అధికారికంగా ప్రకటించడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై సోమవారం విజయమ్మ లేఖ విడుదల చేయగా.. ఆ లేఖను టీడీపీ ఫేక్‌ అని ప్రకటించింది. జగన్‌ తప్పుడు లేఖలు సృష్టిస్తున్నాడని ప్రచారం చేసింది. దాంతోపాటు తమ కుటుంబంపై ఇష్టారీతిన వార్తలు, ప్రచారాలు జరుగుతుండడంపై ఇక విజయమ్మ రంగంలోకి దిగారు. మంగళవారం ఒక సంచలన వీడియో విడుదల చేశారు.

Also Read: Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు పోలీస్‌ శాఖ బిగ్‌ షాక్‌.. పల్నాడు పర్యటనలో భద్రతా వైఫల్యం

సామాజిక మాధ్యమాలు, మీడియాలో జరుగుతున్న ప్రచారం తనను ఎంతో కలచివేశాయని విజయమ్మ తెలిపారు. ఇంతటి నీచానికి దిగజారడం దారుణంగా పేర్కొన్నారు. పాత వీడియో బయటకు తీసి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. చిన్నచిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు.. అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతాడా? అని ప్రశ్నించారు. ఇటీవలి రెండు లేఖలు నేను రాసినవేనని తెలిపారు. తన మనవడి వద్దకు వెళ్లితే తప్పుబట్టడం.. అసలు షర్మిల తన కుమార్తె కాదని ప్రచారం జరగడాన్ని ఖండించారు. ఇలాంటివి సరికాదని హితవు పలికారు.

'నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం నా కొడుకు (జగన్‌కు) లేదు' వైఎస్‌ విజయమ్మ ప్రకటించారు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం తను తీవ్రంగా కలచి వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడడ్డాన్ని తప్పుబట్టారు. సోషల్ మీడియాలో, మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేయడంపై ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటివి పునారవృతమైతే పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి ఉంటుందని విజయమ్మ హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

 

Trending News