AP Liqour Policy: ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చిన కొత్త మద్యం విధానంపై తొలిసారి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఏపీలో అమల్లోకి వచ్చిన మద్యం విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ప్రభుత్వం నడుపుతున్న బెల్టుషాపులు ఎత్తివేశారు. మొత్తం షాపులన్నింటినీ చంద్రబాబు, ఆయన మనుషులు చేతిలోకి తీసుకున్నారు' అని సంచలన ఆరోపణలు చేశారు.
Also Read: YS Jagan: దేశ చరిత్రలోనే చంద్రబాబు బాదుడు ఎవరూ చేసి ఉండరు.. ఏపీలో భయంకర పరిస్థితి
తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో అమలవుతున్న మద్యం విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'గ్రామంలో వేలంపాటలు పెట్టి బెల్టుషాపులు ఇస్తున్నారు. బెల్టుషాపులు లేని వీధి, గ్రామం లేదు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఒక్కో బెల్టు దుకాణానికి రూ.2-3 లక్షల వేలం పాట పెడుతున్నారని వెల్లడించారు. 'ఏ పని జరగాలన్నా, ఏ పరిశ్రమ నడుపుకోవాలన్నా కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే' అని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు ఇంత, చంద్రబాబుకు ఇంత అని చెల్లించుకోవాల్సిందే అనేవి జరుగుతున్నట్లు వివరించారు. రౌడీ మామూళ్ల కోసం వసూలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
Also Read: Old Districts: సీఎం చంద్రబాబు మరో సంచలనం.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ 13 జిల్లాలు?
'ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దానికంటే ముందుగానే ఆసమయం వచ్చింది' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఆరు నెలలకే అలాంటి పరిస్థితి తలెత్తిందని.. పార్టీ నాయకత్వం రంగంలోకి దిగాలని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర లభించకపోవడం, ఫీజు రీయింబర్స్మెంట్ అంశాలు ప్రజలను ఇప్పుడు ఇబ్బందిపెడుతున్నాయని వివరించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. మండలం, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మూడు స్థాయిల్లో ఆందోళనలపై కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.