RRR: 'ఆర్ఆర్ఆర్' థియేటర్ వద్ద కలకలం.. గన్‌తో యువకుడి హల్‌చల్...

Youth hulchul with gun at RRR theatre: ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 03:09 PM IST
  • ఆర్ఆర్ఆర్ మేనియా
  • థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా
  • పిఠాపురంలో గన్‌తో హల్‌చల్ చేసిన యువకుడు
RRR: 'ఆర్ఆర్ఆర్' థియేటర్ వద్ద కలకలం.. గన్‌తో యువకుడి హల్‌చల్...

Youth hulchul with gun at RRR theatre: ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్‌తో థియేటర్లు జాతరను తలపిస్తున్నాయి. థియేటర్ల ముందు డప్పుల మోతలు, ఈలలు, కేకలతో ఫ్యాన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఓ ఫ్యాన్ ఏకంగా గన్‌తో థియేటర్ వద్దకు రావడం తీవ్ర కలకలం రేపింది.

పిఠాపురంలోని అన్నపూర్ణ థియేటర్ వద్దకు వచ్చిన ఓ యువకుడు చేతిలో గన్ పట్టుకుని హల్‌చల్ చేశాడు. గన్‌తోనే థియేటర్ లోపలికి వెళ్లిన అతను... సినిమా షో నడుస్తుండగా చేతిలో గన్ పట్టుకుని స్క్రీన్ ముందు అటు ఇటు తిరిగాడు. దీంతో సినిమాకు వచ్చిన ప్రేక్షకులు షాక్ తిన్నారు. మూవీ షో తర్వాత కూడా అతను థియేటర్ బయట గన్‌తో కనిపించాడు. దీంతో అక్కడున్నవారు భయభ్రాంతులకు గురయ్యారు.

యువకుడిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గన్‌ని స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి తరలించినట్లు తెలుస్తోంది. పీఎస్‌లో యువకుడిని విచారించిన పోలీసులు... అది డమ్మీ గన్ అని తేల్చినట్లు సమాచారం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఆర్ఆర్ఆర్ దెబ్బకు బాహుబలి రికార్డులు బద్దలవడం ఖాయమని అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Realme C31: రియల్​మీ నుంచి మరో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్- తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లు!

Also read: Disney plus hotstar: డిస్నీ+ హాట్​స్టార్​ అధ్యక్ష పదవిని వీడిన సునీల్ రాయన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News