Baby Girl Died In Anakapalle: 16 నెలల పసికందుపై ఓ కన్నతల్లి ఆగ్రహించి గరిటెతో కొట్టడంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. శనివారం చిన్నారి మృతి చెందగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. ఎలమంచిలికి చెందిన సాయి అనే యువకుడు, గాజువాకలో ఉంటున్న బంగారు స్నేహ అనే యువతి ఇద్దరు ప్రేమించుకున్నారు. 2020 జనవరిలోలో వీరిద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఉపాధి కోసం విజయవాడకు వెళ్లి కాపురం పెట్టారు.
వీరి కాపురానికి గుర్తుగా గతేడాది మార్చి నెలలో పండంటి ఆడబిడ్డ గీతశ్రీ పుట్టింది. కొద్దినెలలు సాజావుగా కాపురం సాగగా.. ఆ తరువాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో విజయవాడ నుంచి వెనక్కి వచ్చేశారు. సాయి ఎలమంచిలిలో ఉంటుండగా.. పాపను తీసుకుని బంగారు స్నేహ గాజువాక వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే సమీప బంధువైన ఎలమంచిలికి చెందిన రమణబాబు అనే వ్యక్తితో బంగారు స్నేహ సన్నిహితంగా ఉంటోంది. గాజువాక నుంచి కూర్మన్నపాలెం సమీప మంగళపాలెంకు పాపతో వచ్చేసింది. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహ సముదాయాల్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని.. అక్కడే నివసిస్తోంది.
ఈ నెల 17వ తేదీన చిన్నారి గీతశ్రీ అల్లరి చేస్తుందని ఆగ్రహించిన తల్లి.. గరిటెతో తలపై గట్టిగా కొట్టింది. దీంతో ఆ పసికందు స్పృహ కోల్పోయింది. ఎంతసేపటికి పాప లేవకపోవడంతో మరణించినట్లు గుర్తించిన బంగారు స్నేహ.. వెంటనే రమణబాబుకు విషయం చెప్పింది. అతని సాయంతో అక్కడే ఇంటి వెనుక ఓ గొయ్యి తీసి.. ఖననం చేయించింది. సైలెంట్‌గా తన పనిలో తాను ఉండిపోయింది.
శనివారం బంగారు స్నేహ ఇంటికి వచ్చిన భర్త సాయి.. పాప ఎక్కడ ఉందని ఆరా తీశాడు. తన వద్ద డబ్బులు లేకపోవడంతో పాపను అమ్మేశానని చెప్పింది బంగారు స్నేహ. ఈ విషయంపై సాయి గట్టిగా నిలదీసినా.. సమాధానం చెప్పేందుకు భయపడిపోయింది. ఇంతలో పాప మృతదేహం నుంచి దుర్వాసన రాగా.. వీధికుక్కలు బయటకు లాగాయి. దీంతో గీతశ్రీ మృతి చెందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దువ్వాడ పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు.
Also Read: Special Train: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. వారి కోసం స్పెషల్ ట్రైన్స్
Also Read: Snake in Ecil Canteen: క్యాంటీన్ పప్పులో పాము పిల్ల.. భయాందోళనలో ఈవీఎం ఉద్యోగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook