Tirumala: తిరుమలలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు..

Tirumala: దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా 2025  కొత్త యేడాది వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రంలో ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరిగాయి. మరోవైపు శ్రీవారి ఆలయం ముందు భక్తులు కొత్త యేడాది వేడుకలు జరిగాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 1, 2025, 11:20 AM IST
Tirumala: తిరుమలలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు..

Tirumala: తిరుమలలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు భక్తులు కోలాహలం సందడి నెలకొంది. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన వేళ న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతూ భక్తులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ యేడాది  శ్రీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ  సంబరాలు జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుడిని వేడుకున్నారు. శ్రీవారి చెంత సంబరాలు జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు భక్తులు.

మరోవైపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనాలను ఏర్పాటు చేసారు. దాదాపు 10 రోజుల పాటు భక్తులు శ్రీవారిని వైకుంఠ ద్వారం దర్శించుకునే ఏర్పాట్లు చేస్తోంది. సర్వ దర్శనం టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగా భక్తులకు అందిస్తోంది.తిరుపతితో పాటు తిరుమలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లలో ఈ టోకెన్లను ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చారు.  వైకుంఠ ఏకాదశి సందర్బంగా  జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి ఫస్ట్ త్రీ డేస్  జనవరి 9వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు ఇష్యూ చేయనున్నారు.  

మరోవైపు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రజా  ప్రజానిధుల సిఫార్సు లేఖలను ఆమోదం తెలిపింది. వారానికి రెండు సార్లు రూ. 500 వీఐపీ బ్రేక్ దర్శనంతో పాటు రూ. 300 సుపథం దర్శనం చేసుకోవడానికి అనుమతులు మంజూరు చేసింది. ఇవి కూడా ప్రతి సోమవారం నుంచి గురువారం వరకే ఈ లేఖలకు ఆమోదం తెలుపనున్నారు. శుక్ర, శని, ఆదివారాలతో పాటు పర్వ దినాల్లో ఎలాంటి సిఫార్సు లేఖలు అనుమతించబడదు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News