BC Declartion: 50 ఏళ్లకే పెన్షన్, ప్రత్యేక బీసీ రక్షణ చట్టం

BC Declartion: ఏపీ ఎన్నికల వేళ తెలుగుదేశం-జనసేన బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. అధికారంలో వస్తే వెనుకబడినర్గాలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని తెలిపాయి. వివిధ తాయితాలతో బలహీనవర్గాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని వెల్లడించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 6, 2024, 04:55 PM IST
BC Declartion: 50 ఏళ్లకే పెన్షన్, ప్రత్యేక బీసీ రక్షణ చట్టం

BC Declartion: మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో టీడీపీ-జనసేన అధినేతలు బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల ఆర్ధిక, రాజకీయ, సామాజిక అభివృద్ది లక్ష్యంగా పది అంశాలతో ప్రకటించిన ప్రత్యేక డిక్లరేషన్ ఇది. అధికారంలో వస్తే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం రూపొందిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బీసీ హక్కులు కాపాడేదిశగా చర్యలు తీసుకుంటామన్నారు. 

తెలుగుదేశం-జనసేన బీసీ డిక్లరేషన్ ముఖ్యాంశాలు

50 ఏళ్లకే బీసీలకు పెన్షన్, 4 వేలకు పెరగనున్న పింఛన్
చంద్రన్న భీమా 10 లక్షలకు పెంపు
పెళ్లికానుక కింద 1 లక్ష రూపాయలు
బీసీ ఉప ప్రణాళిక ద్వారా ఏడాదికి 30 వేల కోట్లు, 5 ఏళ్లలో 1 లక్షా 50 వేల కోట్లు
బీసీ సబ్ ప్లాన్ నిధుల బదిలీ కాకుండా చర్యలు
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్
బీసీల ఆర్ధికాభివృద్ధికి పలు ప్రోత్సాహకాలు ఐదేళ్లలో 10 వేల కోట్లు
చట్టబద్దంగా కులగణన కార్యక్రమం

అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్‌పై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. మరోసారి బీసీల్ని మోసం చేసేందుకు టీడీపీ సిద్ధమైందని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చారా అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ బీసీలను పట్టించుకోని చంద్రబాబు ఇప్పుుడు డిక్లేరేషన్ పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్‌లో 10 మంది బీసీ మంత్రులున్నారని, రాజ్యసభలలో నలుగురు బీసీలున్నారని మంత్రి వేణుగోపాల్ కృష్ణ గుర్తు చేశారు. 58 ఎమ్మెల్సీల్లో 29 బీసీలకు ఇచ్చామన్నారు. ఇలా ఎప్పుడైనా చంద్రబాబు చేశారా అని ప్రశ్నించారు.

Also read: Pawan Kalyan: అనకాపల్లి నుంచి ఎంపీగా పవన్, గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News