తూగో: ధవశేశ్వరం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు..తనపై జనాల్లో ఇంత ప్రేమ ఉంటుందని కలలో కూడా ఊహించలేదన్నారు... జనసేనికులు ఇక నుంచి అవినీతి మృగాలను చీల్చిచెండారుతాని పవన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ రోజు నిర్వహించిన కవాతు గురించి మాట్లాడుతూ అవినీతిని ప్రక్షాళన చేయడానికే కవాతు నిర్వహించామన్నారు. దోపిడిని కూకటి వేళ్లతో పెకలించడమే కవాతు లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. తన కుమారుడు లోకేష్ కు మంత్రి పదవి తప్పితే ప్రజలకు ఏం రాలేదని పవన్ ఎద్దేవ చేశారు. పంచాయితీ అంటే తెలియని నారా లోకేష్ కు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.
అంతకుముందు పోలీసులు ఆంక్షల నేపథ్యంలో సభా స్థలానికి కాలిబాట కాకుండా కారులోనే పవన్ వచ్చారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై నిర్వహించిన కవాతులో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాగా పిచ్చుకలంక నుంచి ధవళేశ్వరం వరకు జనసేన కవాతు సాగించింది. జనసేన బహిరంగ సభలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.