PK Proposal: ఏపీలో వైసీపీ- కాంగ్రెస్ పొత్తు సాధ్యమేనా, పీకే ప్రతిపాదన జగన్‌కు తెలుసా లేదా..??

PK Proposal: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..కాంగ్రెస్‌లో చేరిక కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనలో సాధ్యాసాధ్యాలేంటి, వైసీపీ నేతలేమంటున్నారో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 23, 2022, 11:02 AM IST
  • ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు సాధ్యమేనా
  • వైసీపీతో పొత్తు పెట్టుకోవాలనే పీకే ప్రతిపాదన వెనుక కారణమేంటి
  • వైఎస్ జగన్ మదిలో ఏముంది, పీకే ప్రతిపాదన ఆయనకు తెలుసా లేదా..
 PK Proposal: ఏపీలో వైసీపీ- కాంగ్రెస్ పొత్తు సాధ్యమేనా, పీకే ప్రతిపాదన జగన్‌కు తెలుసా లేదా..??

PK Proposal: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్..కాంగ్రెస్‌లో చేరిక కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీయనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనలో సాధ్యాసాధ్యాలేంటి, వైసీపీ నేతలేమంటున్నారో పరిశీలిద్దాం..

దేశంలో రాజకీయ వేడికి ప్రశాంత్ కిషోర్ వేదికగా మారారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక దాదాపు ఖరారైన నేపధ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత్ కిశోర్ మిత్రుల సంగతేంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే దేశంలో కాంగ్రెస్ అధికారంలో రావాలంటే.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదన చేశారు ప్రశాంత్ కిశోర్. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్..ప్రశాంత్ కిశోర్‌కు కటీఫ్ చెప్పే ఆలోచనలో ఉన్నారు. 

కాంగ్రెస్ పార్టీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తు అనేది వాస్తవదూరంగా కన్పిస్తోంది. ఎందుకంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిందే సోనియా గాంధీకు వ్యతిరేకంగా. దేశ రాజకీయాల్ని 2004 నుంచి 2014 వరకూ శాసిస్తున్న సమయంలోనే సోనియా గాంధీని ఎదిరించి మగాడిగా వైఎస్ జగన్‌కు పేరుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యేందుకు ప్రధాన కారమం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే. అటువంటి పార్టీతో తిరిగి పొత్తు అనేది  
పూర్తిగా అసాధ్యమేననేది రాజకీయ విశ్లేషకుల మాట. అయితే ఏపీలో అధికారంలో తెచ్చేందుకు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదన కొత్త సమీకరణాలకు తెరతీయనుందా అనే చర్చ ప్రారంభమైంది. 

వైసీపీ నేతలేమంటున్నారు

ఎన్నికల్లో పొత్తుల వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాధ్‌లు విభిన్నంగా స్పందించారు. ఎన్నికల పొత్తుల వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌దే తుది నిర్ణయమని..ఆయన మాత్రమే ఈ విషయంపై స్పందిస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి,..పరిరక్షించే పార్టీకే తమ మద్దతుంటుందని కూడా స్పష్టం చేశారు. ఇక మంత్రి గుడివాడ అమర్‌నాధ్ మాత్రం పూర్తిగా తిరస్కరించారు. వైఎస్సార్ కుటుంబాన్ని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకే తమ పార్టీ పుట్టిందని..అలాంటిది ఆ పార్టీతో ఎలా కలుస్తామని ప్రశ్నించారు మంత్రి అమర్‌నాధ్. వ్యూహాలు రచించడమే పీకే పని అని..అమలు చేసేది మాత్రం జగనేనన్నారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని సీట్లు వెతుక్కునేలా, పొత్తులు పంచుకునేలా చేసిన ఘనత తమ అధినేత జగన్‌దేనని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

పీకే ప్రతిపాదన జగన్‌కు తెలుసా

అయితే వైఎస్ జగన్‌తో సన్నిహిత సంబంధాల్ని కలిగి..ఇప్పటికీ టచ్‌లో ఉన్న వైఎస్ జగన్‌కు తెలియకుండానే ప్రశాంత్ కిశోర్ ఈ ప్రతిపాదన చేశారా అనే విషయంపై మరో చర్చ ప్రారంభమైంది. వైసీపీ నేతల స్పందన ఎలా ఉన్నా..వైసీపీ ఆవిర్భావానికి కారణాలేమున్నా సరే..రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులుండరనేది మాత్రం వాస్తవం. మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుందో వేచి చూడాలి. 

Also read: Contempt of Court: ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటీషన్, ప్రతివాదులు సీఎం జగన్, మంత్రులు బొత్స, బుగ్గన తదితరులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News