MP Avinash Reddy: రేపు విచారణకు హాజరుకాలేను.. సీబీఐకు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

MP Avinash Reddy Letter To CBI: సీబీఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. రేపు జరిగే విచారణకు తాను హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండడంతో విచారణకు రాలేనని అన్నారు. అయితే ఎంపీ లేఖపై సీబీఐ అధికారులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2023, 09:40 PM IST
MP Avinash Reddy: రేపు విచారణకు హాజరుకాలేను.. సీబీఐకు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

MP Avinash Reddy Letter To CBI: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి రెండోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనను ఈసారి సీబీఐ తప్పకుండా అరెస్ట్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. సీబీఐ నోటీసులపై అవినాష్‌ రెడ్డి స్పందించారు. తాను విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకు లేఖ రాశారు. ముందుగా వేంపల్లి, పులివెందులలో నిర్ణయించుకున్న కారణాల రీత్యా విచారణకు రాలేనని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రేపు విచారణకు హాజరుకావాల్సిందేనంటూ ఇప్పటికే సీబీఐ స్పష్టంచేసిన నేపథ్యంలో రేపు ఏం జరుగుతోందనని ఉత్కంఠ నెలకొంది. 
 
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇప్పటికే సీబీఐ రెండుసార్లు విచారించింది. మరోసారి విచారణకు హాజరుకావాలంటూ పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 6న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా ఈ నోటీసులపై స్పందించిన అవినాష్ రెడ్డి.. విచారణకు హాజరుకాలేనంటూ లేఖ రాశారు. రేపు, ఎల్లుండి తప్ప మిగతా ఎప్పుడైనా విచారణకు హాజరవుతానని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై సీబీఐ నుంచి ఇంకా సమాధానం రాలేదు. దీంతో ఆయన విచారణకు హాజరవుతారా..? లేదా..? అనే విషయం సస్పెన్స్‌గా మారింది. 

ఈ కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది సీబీఐ. రేపటి విచారణకు అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చినా.. భాస్కర్ రెడ్డిని విచారించే అవకాశం కనిపిస్తోంది. వివేకా హత్య కేసులో సీబీఐ పక్కా ఆధారాలు సేకరించిందని.. అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదని ప్రచారం జరుగుతోంది. కోర్టులో సమర్పించిన అఫిడవిట్‌లో అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది. హత్య జరిగిన సమయంలో అవినాష్ రెడ్డి ఫోన్ లోకేషన్ ఘటన స్థలంలోనే చూపించినట్లు గూగుల్ టేకౌట్‌ అనే యాప్ ద్వారా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు..? హత్యతో ఏమైనా పాత్ర ఉందా..? అనే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. 

మరోవైపు వివేకా హత్య కేసులో ఏం జరుగుతోంనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ కేసులో కీలక పాత్రధారులకు సీబీఐ వరుసగా నోటీసులు జారీ చేస్తూ.. విచారణను మరింత స్పీడ్ పెంచడంతో ఏదో జరగబోతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Urinated In American Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. మద్యం మత్తులో నిద్రపోతూ..  

Also Read: Zoom Layoffs: జూమ్ సంచలన నిర్ణయం.. ఆకస్మికంగా అధ్యక్షుడికి ఉద్వాసన   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News