Jawad Cylone Update: ఆంధ్రప్రదేశ్‌ను తుపాను వెంటాడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడి..తుపానుగా మారనుంది. ఈ నెల 18వ తేదీ నాటికి తుపానుగా మారననుందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి.
అండమాన్ సమద్రంలో ఏర్పడిన అల్పపీడనం(Low Pressure) ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ అల్పపీడనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. పశ్చిమ వాయుదిశగా కదులుతూ..ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. ఈ నెల 15 అంటే ఇవాళ్టికి వాయుగుండంగా మారనుంది. తిరిగి ఈ నెల 17వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఈ నెల 18 వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించి జవాద్ తుపానుగా(Jawad Cyclone) మారే సూచనలు కన్పిస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఈశాన్య గాలులు రాష్ట్రంపై కొనసాగుతుండటం వల్ల.. సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు విస్తారంగా కురుస్తాయని ఐఎండీ(IMD)వెల్లడించింది. గత 24 గంటల్లో ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు కడప, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు(Heavy Rains) నమోదయ్యాయి.
Also read: Cyclone Jawad: ఆంధ్రప్రదేశ్‌పై జవాద్ తుపాన్ ప్రభావం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి