Pawan Kalyan: ‘జగనన్న విద్యా కానుక’ పేరుపై జనసేనాని అభ్యంతరం

ఇటీవల ప్రవేశపెట్టిన మరో కొత్త పథకం ‘జగనన్న విద్యా కానుక’ (Jagananna Vidya Kanuka). అయితే ఈ పథకం పేరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan On Jagananna Vidya Kanuka Name) అభ్యంతరం వ్యక్తం చేశారు.

Last Updated : Oct 11, 2020, 08:29 AM IST
Pawan Kalyan: ‘జగనన్న విద్యా కానుక’ పేరుపై జనసేనాని అభ్యంతరం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రవేశపెట్టిన మరో కొత్త పథకం ‘జగనన్న విద్యా కానుక’ (Jagananna Vidya Kanuka). ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, షూస్.. ఇలా వారికి అవసమైనవి జగనన్న విద్యా కానుకలో భాగంగా అందించనున్నారు. అయితే ఈ పథకం పేరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పిన తరహాలోనే పవన్ కళ్యాణ్ సైతం జగనన్న గారి కానుక అనేకంటే కూడా ‘మోదీ - జగనన్న గారి కానుక’ అంటే బాగుంటుందని (Pawan Kalyan On Jagananna Vidya Kanuka) సూచించారు.

ఈ పథకంలో భాగంగా 60 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులు, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు అందిస్తుందని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు నిధులకు సంబంధించిన రిపోర్టును ట్వీట్ చేశారు. ఇటీవల ఏపీ బీజేపీ కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఇదే తీరుగా స్పందించారు. కనీసం కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పకపోతే ఏపీ ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో పాటు మారాలి జగన్.. మార్పు రావాలి జగన్ అంటూ ఆయన ట్వీట్లు చేయడం తెలిసిందే.

 

 

 

కేంద్రం, రాష్ట్రం కలిసి నిధులు ఇస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర ఫొటోలు లేకుండా కేవలం సీఎం వైఎస్ జగన్ స్టిక్కర్లు మాత్రమే వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. లేకపోతే వైఎస్ జగన్ ట్రస్ట్ ప్రారంభించి ఆయన కుటుంబ నిధులతో పథకాలకు ఆయన పేరు పెట్టుకుంటే తమకు ఏ అభ్యంతరం లేదని సైతం సూచించడం గమనార్హం.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News