చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ పెడతారని బీజేపీ భయపడుతోందా ?

చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ పెడతారేమోనని బీజేపీ భయపడుతోందా ?

Last Updated : Feb 15, 2018, 11:18 PM IST
చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ పెడతారని బీజేపీ భయపడుతోందా ?

ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రాన్ని ఎదుర్కోవడానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు థర్డ్ ఫ్రంట్ పెడతారా అని బీజేపీ భయపడుతోందని అన్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం నుంచి టీడీపీ తరపున లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న జేసీ దివాకర్ రెడ్డి తాజాగా ఆంధ్రా రాజధాని వెలగపూడిలో మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు పట్ల తీవ్ర అసహనంతో వున్నారు అని అన్నారు. కేంద్రంపై నిధుల కోసం పోరాటం చేస్తోన్న ఏపీ సీఎం చంద్రబాబు.. తాను అనుకున్నది సాధించలేకపోతే ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పి ప్రత్యేకంగా థర్డ్ ఫ్రంట్ పెడతారేమోనని బీజేపీ భయపడుతోందని అభిప్రాయపడ్డారు.

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రపంచ ధనికుల్లో ఒకరైన ముఖేశ్ అంబాని సైతం వచ్చి చంద్రబాబుని కలిసి వెళ్లడంపై స్పందించిన జేసీ దివాకర్ రెడ్డి.. ఈ సమయంలో ముఖేశ్ అంబాని లాంటి బడా బాబులు వచ్చి చంద్రబాబుని కలుస్తుండటం కూడా ఆలోచించాల్సిన పరిణామం అని మీడియాతో చెప్పినట్టుగా ది హన్స్ ఇండియా ఓ కథనాన్ని ప్రచురించింది.

Trending News