Four killed on spot : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే నలుగురి మృతి

4 killed on spot in road accident at mangalagiri : గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నలుగురు వ్యక్తులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 11:17 PM IST
  • గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
  • మంగళగిరి మండలంలో చెరువులోకి దూసుకెళ్లిన కారు
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన నలుగురు వ్యక్తులు
Four killed on spot : చెరువులోకి దూసుకెళ్లిన కారు.. స్పాట్‌లోనే నలుగురి మృతి

4 killed on spot in road accident at mangalagiri guntur district : గుంటూరు జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళగిరి మండలంలో (Mangalagiri Mandalam) ఒక కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 

కృష్ణాయపాలెం (Krishnayapalem) నుంచి ఒక కారులో నలుగురు వస్తుండగా... ఎర్రబాలెం చెరువు (Errabalem Pond) మలుపు వద్ద కారు అదుపుతప్పింది. స్పీడ్‌గా చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న సాయి, శ్రీనివాస్‌, నరేంద్ర కుమార్‌, తేజ రాంజీగా అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికులు వెంటనే స్పందించి కారు అద్దాలు పగలగొట్టి నలుగురిని బయటకు తీశారు. కానీ అప్పటికే కారులో ఉన్న నలుగురు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు (Police) కేసు (Case) నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

Also Read : Telangana covid cases : తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ముగ్గురి మృతి

కాగా మృతి చెందిన సాయి, శ్రీనివాస్‌, నరేంద్ర మంగళగిరికి (Mangalagiri) చెందిన వారని, తేజ రాంజీ ఎర్రబాలెం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు (Police) నిర్ధారించారు.

Also Read : Husband Wife Funny Videos: నిద్రపోతున్న భర్తతో భార్య ఏం చేసిందో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

https://bit.ly/3hDyh4GAndroid Link - 

Trending News