Fengal Cyclone Alert: ఫెంగల్ తుపాను రానున్న రెండ్రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదలనుంది. శ్రీలంక లేదా తమిళనాడులో ఈ నెల 30న తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తమిళనాడులో తీరం దాటే పరిస్థితి ఉంటే కడలూరు జిల్లాలో దాటవచ్చు. ప్రస్తుతం తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 3-4 రోజులు అతి భారీ వర్షాలు పడవచ్చు.
ఫెంగల్ తుపాను ప్రభావం ఏపీలో కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో రేపట్నించి అతి భారీ వర్షాలు పడవచ్చు. అటు రాయలసీమలోని ఇతర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు పడే అవకాశమున్నందున ఆరుబయట, పొలాల్లో, చెల్లు టవర్ల కింద ఉండవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. ఇవాళ్టి నుంచి శనివారం వరకూ భారీ వర్షాలు పడనున్నాయి. తీర ప్రాంతంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. అందుకే సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
ఫెంగల్ తుపాను ప్రభావంతో దక్షిణ, ఉత్తర కోస్తా ప్రాంతంలోని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు తప్పవని సూచించింది. ఫెంగల్ తుపాను దృష్టిలో ఉంచుకుని నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అవసరమైతే తీర ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించేందుకు సిద్ధమౌతోంది.
Also read: SC Reservations: మతం మారితే నో రిజర్వేషన్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.