Cyclone Gulab : తెలంగాణ, ఉత్తరాంధ్రకు ఆరెంజ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం

Gulab Cyclone: ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ  పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం విపత్తుల శాఖ సూచించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2021, 11:04 AM IST
  • కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటనున్న తుఫాను
  • రానున్న రెండు రోజులు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తాంధ్రతో పాటు, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం
Cyclone Gulab : తెలంగాణ, ఉత్తరాంధ్రకు ఆరెంజ్‌ అలర్ట్‌.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం

Cyclone Gulab Set To Hit Andhra, Odisha Today; Evacuation Ops On: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రానికి గులాబ్‌ తుఫానుగా (Cyclone Gulab) మారిన సంగతి తెలిసిందే. ఇది గోపాల్‌పూర్‌కు (gopalpur) తూర్పు ఆగ్నేయంగా 310 కి.మీ, కళింగపట్నానికి (kalingapatnam) తూర్పుగా 380 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను గంటకు 7 కిలో మీటర్ల వేగంతో కదిలి బలపడిన తుపాను ఆదివారం మధ్యాహ్నం నుంచి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం(Srikakulam) జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా ఇది తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ  పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం విపత్తుల శాఖ సూచించింది.

Also Read : Janasena Party: అధికారిక గుర్తు గాజు గ్లాసును కోల్పోయిన జనసేన

ఏపీ ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలతో సహాయక చర్యలు చేపట్టమని అధికారులను ఆదేశించింది. రానున్న రెండు రోజులు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తాంధ్రతో పాటు, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రతో పాటు హైదరాబాద్‌లో (hyderabad), తెలంగాణలోని (telangana) పలు ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Also Read : UNSC India: భద్రతామండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News