Edupugallu: భూ కబ్జాలు.. మోసాలు.. బెదిరింపుల కేసులు తీవ్రమవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. ఎవరైనా కబ్జాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని.. వారికి జైలే దిక్కు అని హెచ్చరికలు జారీచేశారు. భూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని.. రీసర్వేలోని తప్పులనూ సరిచేస్తాం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
Also Read: YS Jagan: అమిత్ షా అంబేడ్కర్ వ్యాఖ్యలకు వైఎస్ జగన్ మద్దతు.. వైసీపీ సంచలన ట్వీట్
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగళ్లు గ్రామంలో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలకు సంబంధించి పిటిషన్లను సీఎం స్వయంగా స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిఒక్కరికీ న్యాయం చేయాలనేది తనది.. ఎన్‌డీఏ ప్రభుత్వం ఆలోచన అని పేర్కొన్నారు. 'ఎంతో నమ్మకంతో 57 శాతం ఓట్లతో మమ్మల్ని గెలిపించారు. ప్రజల ఆశల్ని నెరవేర్చేందుకు ఆర్నెళ్లుగా కష్టపడుతున్నాం' అని చెప్పారు.
Also Read: YS Sharmila: వైఎస్ షర్మిల బర్త్ డే వేడుకల్లో గొడవ.. పొట్టు పొట్టు కొట్టుకున్న నాయకులు
ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనపై సీఎం చంద్రబాబు విరుచుకుపడ్డారు. 'గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో మన భూమికి దిక్కులేకుండా చేసే పరిస్థితిని తీసుకొచ్చారు' అని వివరించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భారీగా ఫిర్యాదులు వచ్చాయని వాటిని త్వరగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 'రెవెన్యూ సదస్సుల్లో 95,263 పిటిషన్లు వచ్చాయి. దాదాపు 3 లక్షల మంది సదస్సులకు హాజరయ్యారు' అని వెల్లడించారు. పాస్‌పుస్తకంపై క్యూఆర్ కోడ్, జియో ట్యాగింగ్‌తో ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలనేది తమ ఆలోచన అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 'ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజల ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వం ఇది అని స్పష్టమైన హామీ ఇస్తున్నా' అని ప్రకటించారు. 'ఒకవైపు అవినీతి.. మరోవైపు వ్యవస్థల విధ్వంసం.. అధికార యంత్రాంగాన్ని నిర్వీర్యం చేయడం.. ఇలా అనేక సమస్యలను సృష్టించారు' అని వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. 'భూములపై ఒకటి రెండు కాదు కొన్ని వందల కేసులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత తీసుకొని పట్టుదలతో ముందుకెళ్తున్నాం' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook