Babu Cabinet: చంద్రబాబు క్యాబినెట్లో కాబోయే మంత్రులు వీళ్లేనా..? పార్టీకి అండగా నిలబడిన వారికే ప్రాధాన్యం..

Chandrababu Naidu Cabinet: ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. సైకిల్ తొక్కిన తొక్కుడుకు ఫ్యాన్ రెక్కలు విరిగిపడ్డాయి. త్వరలో ముఖ్యమంత్రిగా నాల్గోసారి ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఏర్పడే క్యాబినేట్  మంత్రులు వీళ్లేనా ? ఇంతకీ చంద్రబాబు కొత్త క్యాబినేట్ లో ఎవరెరవకి పదవులు దక్కబోతున్నాయో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 6, 2024, 10:29 AM IST
Babu Cabinet: చంద్రబాబు క్యాబినెట్లో కాబోయే మంత్రులు వీళ్లేనా..? పార్టీకి అండగా నిలబడిన వారికే ప్రాధాన్యం..

Chandrababu Naidu Cabinet: ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పోటీ చేసిన 175 స్థానాల్లో 164 సీట్లు కట్టబెట్టి.. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను చాటారు. కేవలం సంక్షేమాన్ని నమ్ముకుని అభివృద్ధిని గాలికి ఒదలేసాడాని కూటమి నేతలు చెప్పిన మాటలను ప్రజలు నమ్మారు. దీంతో కూటమికి గతంలో చరిత్ర ఎరగని విధంగా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు. ఇక చంద్రబాబు ఈ నెల 9న లేదా 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏ డేట్ లో చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే కొత్తగా కొలువు తీరబోయే  కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీకి కూడా బెర్త్ లు దక్కనున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. పార్టీ గడ్డు పరిస్థితులున్నపుడు అండగా ఉన్న నాయకులకు ఈ సారి క్యాబినేట్ బెర్త్ లు కన్ఫామ్ అనే ముచ్చట వినబడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో సీనియర్లతో పాటు వైయస్ఆర్సీపీ  ప్రభుత్వ కక్షసాధింపులపై పోరాటం చేయడమే కాకుండా అక్రమ కేసులు ఎదుర్కొన్న నేతలకు ఈ సారి  ప్రాధాన్యం దక్కనున్నట్టు ప్రచారం జరగుతోంది.
 
అంతేకాదు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన తెలుగు దేశం నేతలకు ఈ సారి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా క్యాబినేట్ కూర్పు ఉండబోతుందట. ఇందులో భాగంగా వైసీపీపై ఎక్కువగా పోరడాడిన తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తోపాటు టీడీపీ సీనియర్ నేతలు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ, చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి వారున్నారు. గత ప్రభుత్వం అచ్చెన్నాయుడుపూ ఈఎస్ఐ కుంభకోణం కేసులో అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. దీనిపై ఆ తర్వాత పెద్దగా ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు.  

అలాగే వైసీపీకి చెందిన ధూళిపాళ్ళ నరేంద్రపై 16 పైగా కేసులు బనాయించి రాజమండ్రి జైలులో పెట్టారు. సంగం డెయిరీపై పోరాడారు. నరేంద్ర మొత్తంగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. గతంలో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. ఈ సారి ఆయనకు క్యాబినేట్ లో బెర్త్ కన్ఫామ్ అనే ముచ్చట వినిపిస్తోంది. మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై హత్యకేసు పెట్టి జైలులో పెట్టారు. మాజీ మంత్రి నారాయణపై ఇన్నరింగ్ రింగ్ రోడ్డు కేసులు ఎదుర్కొన్నారు. అయ్యన్నపాత్రుడుపై  పలు కేసులు బనాయించారు. వీరితో పాటు గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లోనూ గెలిచి పార్టీని విడిచిపెట్టకుండా అండగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, గంటా శ్రీనివాసరావు, పయ్యావుల కేశవ్ వంటి నేతల పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. అటు నారా లోకేష్, బాలయ్యలకు ఈ సారి క్యాబినేట్ చేరుతారా అనేది చూడాలి. మరోవైపు జనసేన తరుపున పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వంటి వారికీ కూడా జనసేన కోటాలో మంత్రి పదవులు ఖాయం అనే ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు బీజేపీ తరుపున కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, సుజనా చౌదరిలలో ఎవరో ఒకరో ఇద్దరికో ఈ సారి క్యాబినేట్ బెర్త్ కన్ఫామ్ అనే ప్రచారం జోరుగా సాగుతోంది.  

జిల్లాల వారీగా ప్రాధాన్యత, సామాజిక కుల సమీకరణాల ఆధారంగా అవకాశం కల్పించనున్నారు. ఇక సామాజిక వర్గాల వారీగా చూస్తే కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక వర్గాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నందున పైన చెప్పిన వారిలో ఎవరి మంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గంలో బీజేపీ, జనసేనలకు రెండేసి మంత్రి పదవులు చొప్పున కేబినెట్ లో స్థానం ఇవ్వాల్సి ఉన్నందున అటువైపు నుంచి కూడా పోటీ ఎదురుకానుంది. మొత్తంగా చంద్రబాబు క్యాబినేట్ లో ఎవరెవరికీ మంత్రి పదవులు దక్కానున్నాయనేది చూడాలి.

Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News