Chandrababu Case: స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్‌తో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్ ముగియడంతో ఇవాళ వర్చువల్‌గా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆరోగ్య, భద్రతపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ 1 వరకూ రిమాండ్ పొడిగించింది న్యాయస్థానం.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును ఇవాళ వర్చువల్‌గా విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. క్వాష్ పిటీషన్, బెయిల్ పిటీషన్‌పై ఇంకా నిర్ణయం వెలువడకపోవడంతో మరోసారి రిమాండ్ తప్పలేదు. వర్చువల్‌గా ఏసీబీ కోర్టులో హాజరుపర్చగానే ఆరోగ్యం ఎలా ఉందని న్యాయమూర్తి చంద్రబాబుని ప్రశ్నించారు. ఆరోగ్యపరమైన సమస్యలున్నాయని చెప్పగా అధికారులతో వివరణ కోరారు. చంద్రబాబుకు వైద్య సహాయం కోసం మెడికల్ టీమ్ సిద్దంగా ఉందని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన మెడికల్ రిపోర్టులు ఎప్పటికప్పుడు కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
భద్రత విషయంలో తనకు అనుమానాలున్నాయని చంద్రబాబు ఏసీబీ కోర్టుకు విన్నవించారు. తాను జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని కోర్టుకు తెలిపారు. జైలు లోపల, బయట తన భద్రతపై అనుమానాలున్నాయన్నారు. భద్రతపై ఉన్న అభ్యంతరాల్ని లిఖితపూర్వకంగా చంద్రబాబు రాసే లేఖను సీల్డ్ కవర్లో ఇవ్వాలని కోర్టు జైలు అధికారుల్ని ఆదేశించింది. ఆ తరువాత చంద్రబాబు రిమాండ్‌ను కోర్టు నవంబర్ 1 వరకూ పొడిగించింది.
మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం విచారణను రేపు అంటే అక్టోబర్ 20కు వాయిదా వేసింది. మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్‌పై రేపు సుప్రీంకోర్టులో నిర్ణయం వెలువడవచ్చు. మరోవైపు చంద్రబాబు బెయిల్ పిటీషన్‌పై కూడా ఏపీ హైకోర్టులో నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో పిటీషన్ ఉన్నందున విచారణ చేయలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Also read: Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు, ఏపీలో ఇక వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook