Chandrababu One Nation One Election: దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్డీయే సర్కార్ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆ ప్రక్రియపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు మద్దతు పలుకుతూనే ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ జమిలి ఎన్నికల కలకు భిన్నంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.
Also Read: YS Sharmila: మోడీ పిలక చంద్రబాబు చేతుల్లో ఉంది.. గల్లా పట్టి హక్కులను సాధించాలి
అమరావతిలో సీఎం చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా దేశ, రాష్ట్ర రాజకీయ అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 'జమిలి అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనే' అన్ని స్పష్టం చేశారు. 'ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించా' అని తెలిపారు. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఆరోగ్యంపై కూడా స్పందించారు. 'ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. అద్వానీ నాకు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. ఆనాడు ఏపీ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిది' అని పేర్కొన్నారు.
Also Read: Schools Holiday: భారీ వర్షాల ప్రభావం.. ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
వైఎస్సార్‌సీపీ నాయకులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోంది. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని ప్రకటించారు. 'స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలి. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలి' అని చెప్పారు.
గత పరిస్థితులను బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికి కనిపిస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. 'స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసేది కాదు. భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలి. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047' అని సీఎం వివరించారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.