Budameru Impact: బుడమేరు వరద పొటెత్తి విజయవాడను అతలాకుతలం చేసింది. 35 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 70 శాతం నగరం నీట మునిగింది. లక్షకు పైగా వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు విజయవాడ వరద నుంచి బయటపడుతుంటే..కొత్తగా కొల్లేరు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి.
విజయవాడను ముంచెత్తిన బుడమేరు వరద నీరు కొల్లేరు సరస్సులో కలుస్తుంటుంది. ఇప్పుడు బుడమేరు వరదంతా కొల్లేరుకు చేరుతుండటంతో కొల్లేరు సరస్సులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దాంతో లంక గ్రామాలకు ముంపు భయం పట్టుకుంది. కొల్లేరు చుట్టుపక్కల గ్రామాల్లోకి వరద నీరు చేరుతోంది. ఫలితంగా లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండపల్లి, ఏలూరు, కైకలూరు మండలాల్లోని నుచ్చుమిల్లి, ఇంగిలిపాకలంక, పెనుమాక లంక, నందిగామ లంక, ఉనికిలి, తక్కెళ్లపాడు, మణుగునూరు, కొవ్వాడలంక గ్రామాల్ని కొల్లేరు వరద చుట్టుముట్టింది. కొమటిలంక వద్ద కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
కొల్లేరులో నీటిమట్టం ప్రస్తుతం 3.3 మీటర్లు ఉంది. మరో 0.2 మీటర్లు పెరిగితే కొల్లేరులోని చాలా గ్రామాలు నీట మునుగుతాయి. ప్రస్తుతం బుడమేరులో 13-15 వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తోంది. ఇదంతా కొల్లేరులోకే వచ్చి పడుతోంది. బుడమేరు ప్రవాహం మరింతగా పెరిగితే కొల్లేరు పరిసర ప్రాంతాలు పూర్తిగా నీట మునగడం ఖాయం.
Also read: Vijayawada Flood Updates: కృష్ణా నది కరకట్ట ఆక్రమణలు తొలగించి ప్రకాశం బ్యారేజ్ సామర్ధ్యం పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Budameru Impact: బుడమేరు ప్రభావం ఇప్పుడు కొల్లేరుపై, ముంపు భయంలో లంక గ్రామాలు