Shankar Vilas Flyover: ఆంధ్రప్రదేశ్‌లో నగరాలు, పట్టణాలకు మహర్దశ పట్టనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆంధ్రప్రదేశ్‌కు నిధుల సమస్య అనేది తీరుతోంది. కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడి అధికార టీడీపీ కీలక పాత్ర పోషిస్తుండడంతో నిధులు వరదలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజధాని జిల్లా అయిన గుంటూరుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. గుంటూరు పట్టణంలో సుదీర్ఘ కాలంగా ఎదురవుతున్న పెద్ద సమస్యకు పరిష్కారం లభించనుంది.
Also Read: Viral Video: పామును మెడలో వేసుకుని 'పండుగ' చేసుకున్న తాగుబోతు
గుంటూరు పట్టణంలో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఉంది. అప్పటి నగర జనాభాకు తగ్గట్టు ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఇరుకుగా మారింది. ఇక్కడ మరో ఫ్లై ఓవర్ నిర్మించాలని ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా ఫ్లైఓవర్‌కు మాత్రం మోక్షం కలగలేదు. ఇరుకైన రోడ్లలో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అయితే ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఫ్లైఓవర్ నిర్మిస్తామని కూటమి తరఫున పోటీ చేసిన లోక్‌సభ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హామీ ఇచ్చారు.
Also Read: Wine Shops: ఏపీలో మద్యం దుకాణాల రచ్చ.. లాటరీ దక్కించుకున్న వ్యక్తి కిడ్నాప్
అన్నట్టుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోపాటు పెమ్మసాని కేంద్ర మంత్రి కూడా కావడంతో గుంటూరు నగర రూపురేఖలు మారుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. వారి ఆశల్లో భాగంగానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 'ఎక్స్' వేదికగా ఆయన ఓ పోస్టు చేశారు.
'గుంటూరులోని శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తున్నాం. రూ.98 కోట్లు మంజూరు చేశాం. ఈ నిధులతో గుంటూరులో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి' అని నితిన్ గడ్కరీ తెలిపారు. అంతేకాకుండా ఏపీలో రోడ్ల నిర్మాణానికి రూ.400 కోట్లు మంజూరు కావడం విశేషం. రాష్ట్రంలో 200 కిలోమీటర్ల మేర 13 రాష్ట్ర రహదారుల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలపడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు ఫ్లై ఓవర్‌కు నిధులు విడుదల కావడంపై కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ పెమ్మసాని స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
📢 Andhra Pradesh 🛣
In Andhra Pradesh, we have sanctioned ₹400 crore for the development of 13 state roads, spanning a total distance of 200.06 km, under the CRIF scheme.
Additionally, we have approved ₹98 crore for the construction of a 4-lane Sankar Vilas Road Over Bridge…
— Nitin Gadkari (@nitin_gadkari) October 14, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter