AP Group 2 Results: ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల

AP Group 2 Results:  నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్ సైట్‌లో మెరిట్ అభ్యర్థుల జాబితా అప్ లోడ్ చేసింది.

Last Updated : Feb 5, 2020, 07:34 AM IST
AP Group 2 Results: ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు విడుదల

అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-2 మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 2019 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు APPSC Group-2 మెయిన్స్‌ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌‌లో ఉంచింది. మెరిట్ అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు ప్రకటనలో పేర్కొంది. మెయిన్స్ పరీక్షల్లో మెరిట్ సాధించిన వారిలో 858 మందితో కూడిన జాబితాను వెబ్ సైట్‌లో వెల్లడించారు. 

గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాగా, 446 గ్రూప్ 2 పోస్టుల భర్తీ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2,95,036 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పోస్టులకు దరఖాస్తు చేసుకోగా.. 1,77,876 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను జులై 25న విడుదల చేసింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన 6,195 మంది అభ్యర్థులతో పాటు హైకోర్టు ఆదేశాల మేరకు మరో 12 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరికి గతేడాది ఆగస్టులో మెయిన్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ తాజాగా ఫలితాలను విడుదల చేసింది.

ఏపీపీఎస్సీ వెబ్ సైట్

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News