Group 1 Mains Schedule: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. మరో మూడు నెలల్లో అంటే మే 3 నుంచి మే 9 వరకూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం ఏడు రోజుుల్లో ఏడు పరీక్షలు జరగనున్నాయని ఏపీపీఎస్సీ తెలిపింది. గ్రూప్ 1 పరీక్షలు పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉండనున్నాయి.
ఏపీపీఎస్సీస గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలు వెల్లడించింది. మే 3 నుంచి 9 వరకూ వారం రోజుల వ్యవధిలో ఏడు పరీక్షలు జరగనున్నాయి. రోజూ ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకూ జరిగే పరీక్షలకు ట్యాబ్ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపిణీ చేస్తారు. 2023 డిసెంబర్ నెలలో 89 గ్రూప్ 1 పోస్టుల భర్తీకై జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం ఈ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, అనంతపురం, తిరుపతిలో సెంటర్లు ఏర్పాటయ్యాయి. 2024 మార్చ్ 17వ తేదీ ప్రిలిమినరీ పరీక్షలు జరగగా ఏప్రిల్ నెలలో ఫలితాలు వెల్లడయ్యాయి. ఒక్కొక్క పోస్టుకు 50 మంది చొప్పున 4,496 మంది మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ఏ రోజు ఏ పరీక్షో షెడ్యూల్ ఇలా ఉంటుంది
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్
మే 3 న తెలుగు పేపర్-అర్హత పరీక్ష
మే 4 న ఇంగ్లీషు పేపర్- అర్హత పరీక్ష
మే 5 న పేపర్ 1 జనరల్ ఎస్సే పరీక్ష
మే 6 న పేపర్ 2 భారతదేశం, ఏపీ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు
మే 7 న పేపర్ 3 పోలిటిక్స్, రాజ్యాంగం, పాలన, లా అండ్ ఎథిక్స్
మే 8 న పేపర్ 4 భారత్, ఏపీ ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ధి
మే 9 న పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం
Also read: Tragedic Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కర్నూలుకు చెందిన ఐదుగురు మృత్యువాత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి