Tourism App: పర్యాటక రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి హోటళ్ల నిర్మాణం, పర్యాటక రంగం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోంది. త్వరలో సరికొత్తగా యాప్ ప్రవేశపెట్టబోతోంది.
కరోనా సంక్షోభం(Corona Crisis) కారణంగా అన్నిరంగాలపై దుష్ప్రభావం పడినట్టే పర్యాటక రంగంపై తీవ్రమైన ప్రభావం పడింది. ఏపీ పర్యాటక రంగానికి తీరని నష్టం కలిగిందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ (Avanthi Srinivas)తెలిపారు. పర్యాటకరంగాన్ని తిరిగి అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 13 ప్రాంతాల్లో 5 స్టార్ స్థాయి హోటళ్లు నిర్మించనున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలు, నాణ్యతతో హోటళ్లు నిర్మిస్తామన్నారు. మరోవైపు ప్రసాదం పథకాన్ని శ్రీశైలంలో అభివృద్ధి చేశామని..సింహాచలంలో ఇదే పథకాన్ని 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నామన్నారు.
పర్యాటక ప్రాంతాల వివరాల్ని ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయనున్నారు. స్థానిక పర్యాటకుల్ని ఆకర్షించేలా సరికొత్త ప్యాకేజీలు రూపొందిస్తోంది పర్యాటక శాఖ. సీ ప్లేన్స్(Sea Planes) ప్రవేశపెట్టడం ద్వారా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనుంది. పర్యాటక ప్రాంతాల్లో మద్యాన్ని ప్రోత్సహించడం తమ ఉద్దేశ్యం కాదని..మీడియాలో తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. పర్యాటక హోటళ్లలో పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నీళ్లు, ఆహారం వంటి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో విశాలమైన సముద్రతీరం, అడవులు ఉన్నందున ఎకో టూరిజంకు పుష్కలంగా అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే పర్యాటక రంగం(Tourism Department) అభివృద్ధికి త్వరలో ప్రత్యేకమైన యాప్ ప్రవేశపెట్టనున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్(Avanthi Srinivas) చెప్పారు. దసరా నాటికి టూరిజం యాప్(Tourism app) సిద్ధం కానుంది.
Also read: Amazon Smart Tv: త్వరలో అలెక్సాతో పనిచేసే అమెజాన్ స్మార్ట్ టీవి, ప్రత్యేకతలేంటో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook