AP Rains Alert: నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు రానున్న మూడ్రోజులు వర్షాలు తప్పవు. తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో మోస్తరు వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. ఏపీలో రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయని సూచించింది.
ఈ ఏడాది నైరుతు రుతుపవనాలు చాలా ఆలస్యంగా ప్రవేశించాయి. అయినా సరే సరైన వర్షపాతం లేక ఎండ వేడిమి ఎక్కువై జనం విలవిల్లాడారు. ఇప్పుడు రుతుపవనాలు క్రమంగా విస్తరించడంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంద్రవైపుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దాంతో వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడనున్నాయి. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు పడే అవకాశమున్నందున రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రె కాపరులు చెట్ల కింద, పొలాల్లో ఉండవద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది.
రేపు అంటే జూలై 6వ తేదీన చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, గుంటూరు, పల్నాడు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక జూలై 7వ తేదీన ప్రకాశం, నెల్లూరు, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అల్లూరి సితారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కావచ్చు.
ఇక జూలై 8వ తేదీ శనివారం నాడు కర్నూలు, నంద్యాల, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
Also read: AP Early Polls: ఏపీలో మళ్లీ ముందస్తు గానం, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన మతలబు అదేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook