Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబుని సీఐడీ అరెస్టు చేసిందని స్పష్టం చేశారు. ఆర్దిక నేరాల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇంకా కేసు గురించి పూర్తి వివరాలు అందించారు.
ఇవాళ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్టు చేశారు. 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ మరియు 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, నోటీసులు ఇవ్వలేదని వివిధ రకాలుగా టీడీపీ చేస్తున్న ఆరోపణలకు సమాధానమిచ్చారు. వాస్తవానికి ఆర్ధిక నేరాల్లో నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు.
ఇక ఈ కేసు రాత్రికి రాత్రి వచ్చింది కాదన్నారు. సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే జీఎస్టీ నిఘాలో ముందుగా స్కాం బయటపడిందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. 2017-18లో అంటే చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ డీఐజీ నేతృత్వంలోని బృందం చంద్రబాబు హయాంలో విడుదల చేసిన 370 కోట్లలో 240 కోట్లు దారి మళ్లినట్టు గుర్తించిందన్నారు. ఈ కేసులో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కేవం రెండేళ్ల క్రితమేనన్నారు.
దర్యాప్తులో ఆధారాలు లభ్యమయ్యేంతవరకూ చంద్రబాబు పేరు చేర్చకపోవడమే ముఖ్యమంత్రి జగన్ నిజాయితీ, నిష్పాక్షిక వైఖరికి నిదర్శనమన్నారు. 2018లో విజిల్ బ్లోయర్ ద్వారా ఈ స్కాం బయటపడిందని గుర్తు చేశారు. ఏదైనా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అదుపులో తీసుకుని ప్రశ్నించడం సాధారణమేనని, కేసుతో సంబంధం నిజంగా లేకపోతే ఆయనే బయటికొస్తారని చెప్పారు.
Also read: Chandrababu Arrest: ఆ స్కాంలోనే చంద్రబాబు అరెస్టు, నమోదైన సెక్షన్లు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook