Seize the Ship: సీజ్ ది షిప్..ఆ అధికారం నీకెక్కడిది పవన్ అంటూ ట్రోలింగ్

Seize the Ship: ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించాక అంతా సినిమాటిక్ వ్యూ కన్పిస్తోందా అంటే చాలామంది అవుననే అంటున్నారు. సీజ్ ది షిప్ ఆదేశాలు ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 2, 2024, 01:22 PM IST
Seize the Ship: సీజ్ ది షిప్..ఆ అధికారం నీకెక్కడిది పవన్ అంటూ ట్రోలింగ్

Seize the Ship: కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటూ తనిఖీలు చేయడం, సీజ్ ది షిప్ అంటూ ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై జనసైనికులు, పవన్ అభిమానులు సూపర్ అంటూ ప్రచారం చేస్తున్నా ఆ వెనుకే ట్రోలింగ్ కూడా ప్రారంభమైంది. ఇది సినిమా కాదు బాబూ అంటున్నారు. 

కాకినాడలో ఎన్నికల ప్రచారం సమయంలో పీడీఎస్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా అవుతోందంటూ పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆరోపణలు చేశారు.  ఆ తరువాత ఇటీవల కాకినాడ పోర్టు తనిఖీ పేరుతో హడావిడి చేశారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని అక్కడున్న పోర్టు అధికారుల్ని నిలదీసే ప్రయత్నం చేశారు. సీజ్ ది షిప్ ఆదేశాలిచ్చి సంచలనమయ్యారు. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసైనికులకు ఈ ఆదేశాలు రుచించవచ్చు. అందుకే సూపర్ డిప్యూటీ సీఎం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ అసలు ఆ అధికారం నీకెక్కడిది పవన్ అంటూ కొత్త చర్చ ప్రారంభమైందిప్పుడు. ఇది సినిమా కాదు అన్నింట్లో నేనే అంటూ కలగజేసుకోడానికి అంటూ విమర్శలు చేస్తున్నారు. 

ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటూ లేని అధికారాలు ఆపాదించుకుని చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఇది సినిమా కాదంటూ విమర్శలు చేస్తున్నారు. అక్రమ బియ్యం రవాణా అవుతోందని చెబుతున్న నౌక పనామా దేశానికి చెందిన కార్గో షిప్. పేరు పనామా స్టెల్లా. ఇది పశ్చిమ ఆఫ్రికా వెళ్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం నౌకలు సీజ్ చేయడం అనేది కస్టమ్స్ లేదా కోస్ట్ గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాల్లేవు. ఒకవేళ షిప్ సీజ్ చేయాలంటే కోర్టు అనుమతి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా చట్టపరమైన ఆదేశాలు తీసుకోవాలి. నిషేదిత వస్తువులు లేదా ఉగ్రవాద సంబంధాలపై ఆధారాలుండాలి. అప్పుడే షిప్ సీజ్ చేసేందుకు అవుతుంది.

ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కాదు కదా..ముఖ్యమంత్రికి కూడా అధికారాలుండవు. అంతర్జాతీయ నౌక రవాణా సంబంధిత వ్యవహారంపై ఓ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాల్లేవు. ఇదంతా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు తెలియకుండా చేశారని అనుకోలేం. లేదా నిజంగానే సినిమాటిక్ వ్యూలో అలా చేశారా అనే విమర్శలు వస్తున్నాయి. సీజ్ ది షిప్ వ్యాఖ్యలు పవన్ అభిమానులను ఆకట్టుకోవచ్చు కానీ దీనికి చట్టబద్ధత లేదు. హద్దులు దాటిన ఆదేశాలనే విమర్శలు విన్ఫిస్తున్నాయి. 

Also read: Geyser Usage Tips: గీజర్ ఇలా వినియోగిస్తున్నారా, ఈ జాగ్రత్తలు తప్పకుండా ఫాలో కావల్సిందే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News