Shobitha shivanna Passed Away: ప్రముఖ కన్నడ స్మాల్ స్క్రీన్ హీరోయిన్ శోభిత ఆత్మహత్య చేసుకోవడం సినీ ఇండస్ట్రీలో కలకలరం రేపుతోంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ లోని సీ బ్లాక్ ఉన్న ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. కన్నడలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఆమె ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది. ఏదైనా భర్తతో గొడవలు పడిందా.. ఆస్తుల గొడవలున్నాయా..డిప్రెషన్ కు లోనైందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు ఘటన స్థలంలో క్లూస్ టీమ్ ను రప్పించి ఇది నిజంగానే ఆత్మహత్యా.. లేకపోతే.. ఎవరైనా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్ చేసారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు నటి శోభిత కాల్ డేటా ను పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరెవరితో ఫోన్ లో సంభాషించింది. అంతేకాదు ఆమె ఫోన్ లో ఏమైనా ఆధరాలు లభ్యమవుతాయా అనే కోణంలో పోలీసులు ఇన్వెష్టిగేషన్ చేస్తున్నారు.
మరోవైపు శోభిత చుట్టుపక్కల వారితో ఎలా బిహేవ్ చేసేవారు.. వారి బంధుమిత్రులకు సన్నిహితులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంట్లో ఆత్మహత్య సమయంలో ఆమె ఒక్కరే ఉన్నట్టు చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. శోభితా.. లాస్ట్ ఇయర్ సుధీర్ ను పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి గచ్చిబౌలిలోని శ్రీరామ్ నగర్ లో ఉంటున్నారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈమె కన్నడలో ‘బ్రహ్మగంతు, నినిదలే సీరియల్స్ తో బాగా పాపులర్ అయింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని బెంగళూరుకు తరలించనున్నారు.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.